పుట:Naayakuraalu.Play.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

వేయించిన దానశాసములు మున్నగు కథాశేషములగు ప్రతిష్ఠాపనము లన్నియును ఇప్పటికిని ఈ వీరపురుషుల యొక్క విఖ్యాత మగు ప్రజానురాగమును, పరిపాలనసౌష్ఠవమును మనకు వేయినోళ్ల జాటుచు నుద్బోధకములుగా నున్న వనుట నిస్సంశయము.

పల్నాటి ప్రభువులు

అసలు ఈ పల్నాటిని పాలించిన ప్రభువులు ( అనగా వీరజాతికి చెందిన వారు) కేవలము ఆంధ్రదేశమే ఆదినుండి జన్మస్థానముగా గలిగిన ఆంధ్రవంశములకు సంబంధించినవారో, లేక ఏ యుత్తర భారతమునుండియైనను వలసవచ్చి ఆంధ్రదేశమునకు పాలకత్వమును వహించినవారో స్పష్టముగా నిర్ధారణచేయుటకు తగిన ప్రమాణ బలము మన కిప్పుడు లేకున్నను ఎన్నో తరములనుండి ఆంధ్రదేశమునందే నివసించి ఆంధ్రజాతితో, ఆంధ్రభాషతో, ఆంధ్రసంఘముతో, ఆంధ్ర ప్రజలతో కలసిమెలసి "తాము - పరులు" అను భేదము లేకుండా (అనఁగా పాలకులు, పాల్యులు అనే భేదము లేకుండా) ఎంతో అన్యోన్యముగా ప్రజాపాలన మొనర్చి, దేశాభివృద్ధికి అన్నివిదముల తోడ్పడి 'తామే వారు, వారే తాము' గా పాలించి ప్రజాప్రీతిని జూఱగొనిన శుభగుణులని చెప్పుట కెట్టి సందియమును లేదు.

వీరుల పూర్వచరిత్రము

ఇట్లు పల్నాడును పాలించిన వీరులలో (మనకు తెలిసినంత వఱకు ) మొదటిపాలకుఁడు అనుగురాజు. ఈయన చందవోలు పరిపాలకుని కుమార్తె యగు మైలమ్మను వివాహమాడి పల్నాడు నరణదేశముగా గ్రహించి పాలించెను. ఈయనకు మైలమ్మ మాత్రమే కాక విజ్జలదేవి, భూరమాదేవి యని మఱి యిర్వురుగూడ భార్య లుండిరఁట, ఈ భార్యలలో విజ్జలదేవియందు పెదమల్ల , పినమల్ల , బాలమల్ల దేవులును, మైలమాదేవియందు నలగామరాజును, భూరమా దేవియందు కామరాజు మున్నగు నల్గురుకుమాళ్లును పుట్టిరి. అనుగు