పుట:Naayakuraalu.Play.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

63

బ్రహ్మ : అంతకంటె పైయెత్తుకూడా యెత్తింది. పల్నాడు చింపి చీలికెలు చేస్తున్నామట.

కన్న : అది నిజమే. ఇవ్వాళ యిద్దరు పంచుకొంటే రేపు పదిభాగాలవాండ్లు బయలుదేరవచ్చు. తమ కెట్లావుందో గాని పంపిణీ నాకుమాత్రం నచ్చలేదు.

బ్రహ్మ : పదిచీలికలు గాదు, పదివేల చీలికలయినా నా కిష్టమే. ప్రభువులకు పంచడమేగాదు, పల్నాడంతా పరిజనుల కందరికీ పదిలక్షల చెక్కలుజేసి, పంచిపెట్టి, యే బాధలూ లేకుండా వ్యవసాయం చేసుకొని జీవించమని చెప్పడమే నా కిష్టం. ఎన్నిభాగాలు చేసినా పల్నాడు పల్నాటి ప్రజలకే వుంటుంది.

కన్న : ఈ దృష్టితో జూస్తేతప్ప మీ పల్నాటివిభజనం నాకు నచ్చలేదు.

బ్రహ్మ : అందుకనే నాయకురాలు పల్నాటిని బలవంతంగా పంచుకొన్నామని చెప్పేది సులభంగా జనులమనసు కెక్కుతున్నది.

కన్న : మీ సిద్ధాంతం చాతుర్వర్ణ్యముల వారికి నచ్చుతుందనుకోను.

బ్రహ్మ : పోనీ, నచ్చినవాండ్లే మనతో చేరుతారు. అందుకనే పంచములే కావలె నంటున్నా.

కన్న : చివరకు మీ పోరాటము పంచమ-పంచమేతర తగాదాలోకి దిగుతుంది.

బ్రహ్మ : అంతకంటె బీదల- భాగ్యవంతుల తగాదాలోకి దిగుతుదంటే సరిపోతుంది.