ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26
నాయకురాలు
3 - వ రంగము
గామాలపాటి పరిసరాలు
[ నరసింగరాజు, కేతురెడ్డి ప్రవేశము ]
నర : రాస్తా చాలా చుట్టు ; అడివిదారి అందిపుచ్చుకున్నట్టుగా వున్నది.
కే : రహితువత్తిడి బాగా వున్నట్టున్నది. భూమి బాగా తెగుబాటయింది.
న: మేత పుష్కలంగా వున్నది. పశువులు జూడు, నున్నగా యీగవాలితే జారిపోయేటట్టుగా వున్నవి. ఆహా ! పిల్లవా వాడెంత శ్రావ్యంగా పాడుతున్నాడు !
కే: గొంతుకేమి, పాట గమనించండి.
పాట
మోహన - ఖండగతి - ఏక
కాపు బాలిక
కోపానబోయేటి - కోరబొల్లావా
పరుగుపరుగునబోయె - పాలబొల్లావా
మేతదావిణిబడ్డ - మేలంపుటావా
మాచర్ల అడవులు - మనవిగావోయి
మరపుచొప్పున బోయి - మాటదెచ్చేరు.
కే: మన రాజకీయవ్యవహారాలు సామాన్యజనులనుగూడ కలవరపెడుతున్నవిసుమా !