పుట:Naayakuraalu.Play.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

నాయకురాలు

నాయ : పొసగకేమి ? ద్వేష ముండకూడదనిమాత్రమే సత్యవ్రతము కోరుతుంది. ప్రతివాడు నిస్సంగుడై యుద్ధము చేయవచ్చును. మన యుద్ధములో ఉభయపక్షములా పోరినవారికి వొకరిమీద వొకరికి ద్వేషము లేదు. చాలమంది బంధువులు కూడాను. స్వలాభంకోసం పోరలేదు. ధర్మంకోసమే ప్రాణములు విడిచారు.

నల. రా : తమ రంగీకరిస్తారా యిది ?

బ్రహ్మ : నా అభిప్రాయం నే జెప్పితే మంచిది. నాగమ్మగారు చెప్పినది కాదనను. అది మానవధర్మం ; భగవద్గీత దా న్నంగీకరించినది కాని అంతకంటె పైధర్మ మున్నది. అది సత్యధర్మం. మానవధర్మానికి పై మెట్టు. దీనిలో శత్రువును హింసించడం లేదు. అవసరమైతే శత్రువువల్ల తానే హింసించబడి, దానికి ప్రతిక్రియ తలంపకుండా సహించి, తిరిగి శత్రువును ప్రేమించడమే సత్యవ్రతం.

నాయ : అది నేను కాదనను. ఇప్పట్లో అది సాధ్యమూకాదు. ప్రయోజనకారీ కాదు.

బ్రహ్మ : అది మానవునిలో గర్భితమై వున్నది. ప్రస్ఫుట మవుతుంది.

నల. రా : అంతవరకు నాగమ్మగారు చెప్పినదే ధర్మం. త్వరలో సత్యధర్మం లోకకళ్యాణ మొడగూర్చుగాక!

[ నిష్క్రమణం - తెరపడుతుంది ]

సంపూర్ణము