పుట:Naayakuraalu.Play.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

129

బ్రహ్మ : అంతా ముగిసినదిగదా. విరామఘంట మాకు వీర పురుషోచితమయిన మరణమునుగూడ లేకుండ జేసినది. బ్రతిమలాడినా మమ్ము చంపేవారు లేరు. మీ రేమిపనికై దయచేశారు?

కేత : నలగామభూపతీ, నాగాంబికా తమ దర్శనమునకే వస్తున్నా రు.

బ్రహ్మ : శత్రుశేష ముంచరాదని వస్తున్నారుగాబోలు. మరణము మాకూ ఆనందదాయకమే. ఏదిరా కత్తి!

కేత : వారు పోరాటమునకు రావడంలేదు. తమ్ము క్షమింపుమని వేడుకొనుటకోసం వస్తున్నారు.

బ్రహ్మ : క్షమాపణేల ? క్షత్రియోచితమయిన తమ ధర్మమును వారు నేరవేర్చారు. విజయలక్ష్మి వారిని వరించినది. తప్పక వారి నిచ్చటికి దోడ్కొనిరండు.

[ నలగామరాజు, నాయకురాలు ప్రవేశము ]

నల. రా : అయ్యా ! నమస్కారము.

బ్రహ్మ : శుభమస్తు.

నాయ : మాయం దెన్నిలోపములున్నా క్షమించి మమ్మాశీర్వ దింపుడు.

బ్రహ్మ : ఆశీర్వాద మిదివరకే యిచ్చాను. తప్పులు క్షమించే వాడు దేవుడు.

నల. రా : మనలో మనకు అంతఃకలహములు కలిగినందుకు విచారపడుతున్నాను.

బ్రహ్మ: దానికి ఉభయవక్షములూ విచారించవలసినదే. ఒకరి ననవలసినపని లేదు.