పుట:Naayakuraalu.Play.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x

ఆధిక్యము లుండుటంబట్టియే ఈ నాటకమున కీమెను ప్రధానపాత్రముగా పరిగణించుటయేకాక, నాటకముపేరునుగూడ “నాయకురాలు" అనియే శ్రీ పంతులుగారు పెట్టినారని తలంచుచున్నాను. ( ఇది నా యూహమాత్రమే )

ఇతివృత్తసంయోజకము

నాయకురా లను నీనాటకములోని ఇతివృత్తము నలగామరాజు పట్టాభిషిక్తుడైనతరువాత, నాయకురాలి విషప్రయోగమునకు బ్రహ్మనాయుడు తాను గురియై, అచ్చటినుండి పరుగెత్తిపోయి మాచెర్లలో నివాస మేర్పఱచుకొనినపిమ్మటినుండి ఆరంభ మగుచున్నది. కనుకనే ప్రథమాంకము 1-వ రంగములో పొదిలె పాపన్న, కల్వగుంట కాశీపతుల సంభాషణతో వెనుకటి కధాంశములో పొటమరించిన గృహచ్ఛిద్రములును, తత్ప్రయుక్తములగు మనస్పర్థలును సూచనచేయుచు కథోపక్రమణమును ఆరంభించి, క్రమముగా కథాంశమును పెంచుచు, ప్రభువుల మనస్పర్థలవలనను, పరస్పరద్వేషములవలనను ( అనగా ఇచ్చట బ్రహ్మనాయుడు, నాయకురాలు అను ఉభయుల కక్షలమూలమున ) అకృత్రిమములగు ప్రేమలతో, అన్నదమ్ములవలె అన్యోన్యముగా నున్న ప్రజాసామాన్య మేవిధముగా సంతప్తమగుచున్నదియును ప్రదర్శించి, రెండవ రంగమున రవంత రాజకీయపరిజ్ఞానమును,కొంచెమంత ప్రభుభక్తి గల అనుయాయుల హృదయపరిస్థితులును విస్పష్టము చేయదొడగి, మూడవ రంగమున ద్విధావిభిన్నమైన పాలకజనమును ఏకోన్ముఖమునకు గొనివచ్చుటకై పరివారము చేయవలసిన ధర్మమును నిరూపించి, ఆబాలగోపాలమును ఈ సందర్భమున నెట్టి పరిస్థితులలో తగుల్కొని పరితపించుచున్నారో విశదముచేయుచూ, చదువరులకు గ్రామాలపాటిప్రాంతములలోని (నాయకురాలి జన్మస్థలము) ప్రాభవసంపదలను పరిచయము గావించుచు, అయిదవ రంగమునకు ద్రిప్పి నాయకురాలిపక్షపువారి ఆదర్శములను రెండవపక్షము