పుట:Naayakuraalu.Play.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

నాయకురాలు

"సంధిమిచ్ఛంతి సాధనః " అన్నారు. అట్లాగే పని జేతాము. ఎట్లయితే కుదర్చమని చెప్పారు ?

అ. రా : మాచర్లమండలం తమ్ముల కియ్యడానికి అన్నగారు మొదట ఒప్పుకొన్నదేకదా ! యీ యేడుసంవత్సరాల నుంచి వీరే అనుభవిస్తుండిరి.

నర : తాను బుద్ధిపూర్వకంగా ఒప్పుకోలేదంటారు.

అ. రా : కాకపోతేమట్టుకు తనకుమాత్ర మేనూరుమంది వున్నారు. ఒక్క ఆడపిల్లేగదా !

నర : అట్లని రాజ్యం వదలుకుంటారా ? మనం సంపాదించేదంతా మనకోసమేనా?

అ. రా : తనతరువాత రాజ్యం దౌహిత్రాన్నిబట్టి మాకుటుంబములో కే వస్తుంది. దాయాదులతో తగాదా లెందుకని బ్రహ్మనాయుడు చెప్పిన రాజీకికూడా మొదట ఒప్పించా. కన్నుదగిలేపుల్లను ప్రతిదాన్నీ కనిపెట్టేవుండాలె.

నర : నా సంగతేమీ చెప్పించరా ? మీకు కొమాళ్లు కలుగకపోతే నేనే తరువాతవాణ్ణిగదా ?

అ. రా : ఇప్పటికి మీ అన్నేరాజుగదా, అధికారమంతా మీరే చలాయిస్తుంటిరి. వారసత్వం వచ్చినప్పుడు మీ సంగతి చెప్పకుండానా? ఏ మట్లావున్నారు? బొత్తిగా వేలబడి పోతున్నా రే!

నర : భోజనానికి వేళదప్పింది. పైత్యపుభ్రమ వచ్చింది. ఇంకా వూరు ఎంతదూరముండేను ?

అ. రా: ఎంతలేకేమి? రెండుకోసు లుంటుంది.