పుట:Matamu-Pathamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదంతయు చూచిన మేము ఈ వింతను గురించి మరియొక ప్రత్యేకమైన గ్రంథమును వ్రాయాలనుకొన్నాము. ఆ గ్రంథమే ఇపుడు విూరు చదువుచున్న ఈ గ్రంథము. క్రైస్తవులలోని అజ్ఞానమును ఖండించుటకు మేము కొన్ని లక్షలరూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా వ్రాయించడము, పేపర్లు అతికించడము చేసి "సృష్టికర్త కోడ్‌ 963" అను గ్రంథమునే విడుదల చేశాము. మేము చేసిన పనికి హిందువులు అజ్ఞానముగా ప్రవర్తించడమును చూచి వారిలోని అజ్ఞానము పోవుటకు, వారికి జ్ఞానము కల్గుటకు విూరు చదువుచున్న "మతము-పథము" అను గ్రంథమును వ్రాయవలసి వచ్చినది.

ఈ గ్రంథము ద్వారా హిందువులను మేము ప్రశ్నించునదేమంటే! భగవద్గీత అని పేరుపెట్టి వ్రాసిన వ్రాతలు అసభ్యకరముగా ఎలా కనిపించాయి? ఒకవేళ విూకు వాటిలో ఏదైనా లోపము కనిపించియుంటే అక్కడే మేమిచ్చిన అడ్రసులో మాతో సంప్రదించి తెలుసుకోవచ్చు కదా! అట్లుకాకుండ వార్తాపత్రికలలో దానిని వార్తగా అసభ్యమను పదమును ఉపయోగించి వ్రాయడము వలన భగవద్గీతను విూరు గౌరవించినట్లగునా? ఇది ప్రత్యేకించి మహానంది దగ్గరున్న వారినడిగే ప్రశ్నలనుకోండి. ఇక పోలీసుస్టేషన్‌లో కేసుపెట్టి శిక్షవేయించిన హంపి వారినడిగేదేమంటే. దేవాలయ కాంపౌండు గోడకు వ్రాయడము చట్టరీత్యా నేరమను ఉద్దేశ్యముతో విూరు కేసు పెట్టారు. ఇపుడు మేము చేసినది తప్పెలా అవుతుందని ప్రశ్నించవలసివచ్చినది. మేము దేవుని గుడి కాంపౌండు గోడవిూద సిగరెట్ల ప్రచారము వ్రాసియుంటేనో లేక వ్యాపారప్రకటనలు వ్రాసియుంటేనో తప్పగును. కానీ దేవుని గుడివిూద భగవద్గీత వాక్యము వ్రాయడము తప్పా అని ప్రశ్నిస్తున్నాను. అది కూడ అక్కడున్న నియమములు తెలియక వ్రాయడము జరిగినదేకాని తెలిసి బలవంతముగా వ్రాయలేదు. అక్కడ చేసినది సమాజమునకు మంచిని