పుట:Manimalikalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమాలిక... ముందుమాట

సృష్టికి మూలం ప్రణవనాదామని శృతుల నుడి !


ఓంకార నాదం నుండి పుట్టినవే సకల ప్రపంచ భాషలూ యాసలూ... అరుదైన అజంత భాషలో ఒకటైన తెనుగు భాష అతి మధురమైనది... అనేక మంది పరభాషీయులు ఒప్పుకున్నారు... తెనుగున యాసలు మాండలీకాలు జానపదాల ప్రభావం మెండు... అయినప్పటికీ సంసృత పద భూయిష్టమైన తెనుగుభాష... ప్రామాణికంగా చెలామణీ అవుతోంది, దీనినే శిష్టభాష పండిత భాష అని కూడ అనవచ్చేమో... కాలక్రమేణా అనేక సాహితీ ప్రక్రియ లు మన తెనుగున వెలివ్లి విరిసాయి... పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, నవలలు మొదలగునవి. ముఖపుస్తకావిష్కరణముతో అన్నిరంగాలలోనూ సంపర్కత, సమాచార ప్రసరణ మరింత వేగవంతమైంది. నేటి ముఖపుస్తక సాహితీ ప్రక్రియల్లో నన్ను అమితంగా ఆకట్టుకున్నది ఈ మణిమాలిక.

అలతి పదాలతో అనంతార్ధమును ఆవిష్కరించే సాహితీ సాధన. ఈమణిమాలిక. అడ్మిన్స్‌ శ్రీ ప్రసాద్‌ అట్లూరి గారు, శ్రీమతి పద్మాశ్రీరాం గారు నన్నుముందు మాట వ్రాయమన్నప్పుడు నాకు బెరుకు కలిగింది సుమా! నాకున్న పరిమిత తెనుగు సాహితీ పరిజ్ఞానంతో నేను నిజమైన నిక్కచ్చైన విశ్లేషణ ఇవ్వగలనా అని... కానీ వారి మాట కాదనలేక ముందుమాట వ్రాయుటకు సాహసిస్తున్నాను..

ఈ మణిమాలిక ముందుమాటకై వారు పంపిన అందరు రచయితల, రచయిత్రుల కవితా లతికలను ఎన్నాళ్ళనుంచో చదువుతున్నాను. ఇప్పుడు మరలా చదివాను. తెనుగున ఇంతవరకూ ఏ సాహితీ ప్రక్రియకు తీసిపోని అద్భుత ప్రయోగం ఈ మణిమాలిక. ఎవరి మస్తిష్కంలో తొలుతగా ఈ ప్రయోగానికి బీజం పడిందో కానీ నిజంగా వారెంతో అభినందనీయులు...

ప్రతిమనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యలు,
కష్టసుఖాలు, వేదాంత చింతనలు, శాన్యవాదాలు, మిధ్యావాదానలు, వాద... ప్రతివాదాలు, ప్రేమలు, ఆపేక్షలు, మమతానురాగాలు, విరహాలు ఇలా ఎన్నో... మరెన్నో... అన్ని భావాలు కేవలం రెండే రెండు వాక్యాల్లో తెలుపటం త్రుటిలో చదువరులను తమ భావ పరంపరతో కన్నీరు పెట్టించడం , నవ్వించడం , నిరాశావాదం నుండి ఆశావాదానికి మళ్ళించి కార్యోన్ముఖులను చేయటం సాధారణ విషయం కాదు! అదే ఈ మణిమాలికల గొప్పతనం! క్లుప్తత...భావసాంద్రత...తద్వారా

15