పుట:Manimalikalu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76.

ప్రేమలో విఫలమైతే తాగాలా...?
కన్నీళ్ళున్నాయిగా...మందు ఎందుకు..?

77.

నవ్వినా ఏడ్చినట్టుంది.
నీ నవ్వుల ఎక్స్‌పైరీడ్‌ దాటిపోయిందా

78.

నీ పయనంలో నేనో మజిలీ
నాకు మాత్రం నీవే గమ్యం

79.

నివేదించనా నీకు నా ప్రతీ అక్షరాన్ని
ఏఒక్కటైనా నీకు నా వేదాన తెలుపగలదాని

80.

అనుమానాలెందుకు అమ్మాయి
నా ప్రతీ స్పందన నీ స్పందానల ప్రతిస్పందనలే

81.

తాను వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా
పున్నమిరేయికి నల్లరంగు అద్దుతూ

82.

కాలం ఎలాిం గాయాన్నైనా మాన్పుతుందాట
కానీ..నువ్వు కాలానికే గాయంచేశావు

83.

అడగంగనే వరాలిస్తావట...నిజమా శంకరా...?
అంతేలే...బంగారమడిగినా ఇచ్చెడిది బూడిదేగా

84.

నా చేతిలో సిగరెట్
నీ తలపులతో నేను...ఒకేలా...కడదాకా కాలిపోతూ

85.

ఎవరు అన్నారు కన్నీరుకి రంగులేదని
నీతలపులతో అది సప్తవర్ణాలను సంతరించుకుంది

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి

121