పుట:Manimalikalu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

66.

అమ్మ వదిలిన ప్రతినిధి గోరుముద్దలు గుర్తుతెస్తూ జాబిలమ్మ

67.

సమతూకం అంటే పిడికెడు గుండె, కడలంత దు:ఖమూనా?

68.

రెప్పల రగడతో ఛస్తున్నా నీవెదు రుగా వసేనే తెరు చుకుంటాయట

69.

పెదాల పడవ తపిస్తోంది. అధరాల మధురతీరం చేరాలని

70.

ప్రేమించడం నేర్పినవాడివి విరహా న్నీ నేర్ప లేదేం ?

71.

బాల్యం తలొంచుకుంది... నా పెద్దరికపు చిన్నతనాన్ని చూస్తూ

72.

క్రొంగొత్త రంగులతో మనసు. నీ తలపుల కుంచెతో

73.

చల్లని నీడ కోరుకున్నా మల్లెల మేడనే ఇచ్చావు

74.

అకర్ష ాలు తలొంచుతున్నాయి నిన్ను వర్ణించడానికి వాటికి సిగ్గట

75.

దిష్టి తీయనా నీ అందాల మోముపై పుట్టుమచ్చనై?

మణి మాలికలు జ రాజేష్‌ యాళ్ళ