పుట:Madhavanidanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేతువిపరీతార్ధకములు:-- సిత్తమును ప్రధానముగజేసి పుట్టిన వ్రణశోఫమున పాకావస్థ నున్న వ్రణశోఫమునకు సిత్తమును వృద్ధినొందించు నుష్ణవీర్యద్రవ్యములుజేర్చి కట్టు గట్టుట హేతువిపరీతార్ధకమగు ఔషధము. పిత్తవ్రణమునందు విదాహకరములైన యనాదుల భుజించుట హేతువిపరీతార్ధకమగునన్నము. వాతమున జనించిన యున్మాదమున వాతమును వృద్ధినొందించు భయమును జూపుట హేతునిపరీతార్ధకమగు విహారము. (ఇచ్చట సిత్తముకల్గిన వ్రణమునందు, సిత్తవర్ధకములగు నౌషధాన్న విహారాముల నుపయోగించినను, హేతువైనపిత్తమును శమింపజేయు కార్యమును గల్గించును, కావున హేతువిపరీతార్ధకరము లని యెరుంగునది.) ఇత్తెరంగుననే వ్యాధివిపరీతార్ధకములయందు గూడ నూహించునది. (ఇవి హేతువిపరీతార్థకరములగు ఔషధ-అన్న-విహారములు)

వ్యాధివిపరీతార్ధములు:- అజీర్ణమున సమనములగునపుడు పమనములు గల్గించు మ్రంగకాయ నుపయోగించుట వ్యాధివిపరీతార్ధకరమగు ఔషధము. విరేచనములగు నపుడు పాలుద్రాగుట వ్యాధివిపతీతార్ధకరాహారము. సమములగునపుడు అజీర్ణరసమును వెడలించుటకై, వ్రేళ్లచే పెల్లగించి వమనములుచేయుట వ్యాధి విపరీతార్ధకరమగు విహారము. (ఇవి వ్యాధివిపరీతార్ధకములగు ఔషధ్-అన్న-విహారాములు)

హేతువ్యాధులకు విపరీతార్ధకములు:--నిప్పున కాలిన వ్రణమునకు ఉష్ణగుణ ప్రధానములగు అగరు మున్నగుఔషధములను పట్టువేసి యుపయోగించుట ఉష్ణగుణము కల నిప్పునకును, దానకల్గినవ్రణమునకును సమానగుణమైనను, ఆరెంటికి విపరీతార్ధకమగు ఔషధము. విషమునకు విషము నుపయోగించుట కూడ హేతువ్యాధులకు విపరీతార్ధకరౌషధమగును. మద్యపానమున జనించిన మదాత్యయమునందు మధ్యము నాహారముజేయుట హేతువ్యాధి విపరీరార్ధకరా న్నమగును. నీటియందీదుటఛే కల్గిన నమ్మూఢనాశమునందు నీటిహందీతగొట్టుట హేతువ్యాధులకు విపరీతార్ధకరమగు విహారము. (ఇవి హేతువ్యాధివిపరీతార్ధకరములగు ఔషధ-అన్న-విహారములు.)

ఇచ్చట నమనాదులయందు మ్రంగకాయ మున్నగునవి హేతువ్యాధుల కనుగుణలుగ నుండుటఛె వ్యాధిని వృద్దినొందించవ్లసియున్నను, ఔషధాదులప్రభావముచేత హేత్వాదులకు విరుద్దముగ వ్యాధిశమనరూపమైన కార్యమును కల్గించునని యెరుంగునది. ఇట్టియుపశయము వ్యాధిలక్షణములు స్పుటముగ గానమింజేసి వాతాది సంబంధమును నిర్ణయింప వలనుపడకుండుతరి హేత్వాదివిపరీతములగు ఔషధాన్న విహారాదుల నుపయోగించినచో దాననావ్యాధి శమించినయెడ అట్టివ్యాధి వాతికము పైత్తికము నని నిర్ణయింప వలనుపడకుండుతరి హేత్వాదివిపరీతములగు ఔషధాన్న విహారాదుల నుపయోగించినచో దాననావ్యాధి శమించినయెడ అట్టివ్యాధి వాతికము పైత్తికము నని నిర్ణయింప వలయును. కావున నీయుపశయము గూఢలింగవ్యాధిని నిర్ణయింప సాధనమగును. ఎట్టు లన--ఒకవ్యాధి జనించినది. అయ్యది పిత్తమున