పుట:Madhavanidanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలె ననుజ్ఞానమును దెలుపుచు వ్యాధిని బుట్టిందు హేతు నగునది నిదాన మని యర్ధము ఎట్టు లన నియతమైనపరిమాణమునకు న్యూనముగనైనను అధికముగనైనను భుజించి నచో నజీర్ణవ్యాధి జనించునని అజీర్ణమునకు నిదానము చెప్పబడినది. అట్టివిషయమాశనము అజీర్ణవ్యాధికి హెత్వాదినిపరీతములగు చికిత్సలు దెలిసికొనిటకు కారణమై రోగమునకుగూడ హేతునగుటంజేసి యజీర్ణమునకు నిదాన మగును. ఇత్తెరంగుననే తక్కినరోగములందెల్ల నిదానలక్షణ సమన్యయము నెరుంగునది.

పైవిమర్శనముచేత రోగములను బుట్టించు కారణము నిదానమని యేర్పడినది. అదియే రోగములకు హేతువు. అయ్యది నానారూపములుగ నుండును. కావున దాని భేదముల నిరూపింప నలవికాదు. సంగ్రహముగ దానిముఖ్య భేదములుమాత్ర మిచ్చట జూపెద:-

హేతువు నన్నికృష్టము, విప్రకృష్ణము, వ్యభిచారి, ప్రాధానికము నని నాల్గు విధముల నుండునని హరిచంద్రుడు విభజించెను. అందు జాతాదిప్రకోపమునకైనను రోగములకైనను మిక్కిలి సన్నిహితమైన హేతువు సన్నికృష్ట మనబడును. వయస్సు, రాత్రి, పగలు, భోజనము ఇవి వాతాదిదోషప్రకోపమునకు సన్నికృష్టహేతువులు.


పూర్వస్వరూపనిర్వృత్తి, రోగవ్యక్తత, అట్లు వ్యక్త మగునప్పుడు శరీరములో గలుగుమార్పు, దుర్వివేచమగు రోగవ్యక్తిలో గూఢమగు కారణము అనునవి యైయుండును. అంగ సముదాయమే అంగి యను సిద్ధాంతము బహుశాస్త్రకారసమ్మతము కాన అట్తివాని తోగూడిన సముదాయరూపమగు నంగియే యిచ్చట రోగోత్పాదక హేతు వగుచున్నది. ఇదియే మొత్తము నిదానపదార్ధ మని లక్షణకారుని యాశయము.

కావుననే నిదానైకాంగ మగు సంప్రాప్తియం దీలక్షణ్ మతివ్యాప్తము కాకుండుటకై యన్మతే దోషేకకర్తవ్యతాఖ్యా సంప్రాప్తి రిష్యతే, తన్మతే సంప్రాప్తి వ్యుదాసాయ నేతికకర్తవ్యతాక ఇతిపదమ్" అనగా నెవరు దోషములు లోపల గలిగుంచు మార్పే సంప్రాప్తి యందురో వారిమతము నందు రోగోత్పాదకహేతువు మాత్రమే నిదాన మన్నచో సంప్రాప్తియగును గాన బాహ్యహేతు విశిష్ట మగు విశాలనిదానలక్షణము కుదరదు గాన దానిని గూడ క్రోడీకరించుకొనుటకై 'నేతి కర్వవ్యతాక ' యనుదళము వేయ బడె నని సమర్ధించి యుండెను.

కాబట్టి ఆంధ్రవ్యాఖ్యానమున వివరణము సమంజసము కారాలదేమో విజ్ఞులు విచారింపవలెను. నిదానమునందు చికిత్సావిధానజ్ఞూనము కూడియుండుట యనునది యెక్కువగా నుపసన్నము కాజాలదు. తి.ప.రా.