పుట:Lokokthimukthava021013mbp.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1564 తల్లీబిడ్డావకటైనా నోరూ కదుపూ వేరు

1565 తవుడుకు వచ్చినచెయ్యి డబ్బుకూవస్తుంది

1566 తాకోటుగాడికి దధ్యన్నము విశ్వాశికి వేణ్ణీలన్నము

1567 తాడనియెత్తి పారవేయనూగూడదు పామని దాటనూ గూడదు

1568 తాడెక్కేవానికి తలదన్నవాడుండును

1569 తాడేక్కేవానిని యెంతవరకు యెగసనదోయవచ్చును

1570 తాతకు దగ్గులు నేర్పినట్లు

1571 తాతాచార్యుల ముద్ర భుజము తప్పినా వీపు తప్పదు

1572 తాతా పెండ్లాడుతావా అంటే నాకెవడిస్తాడురా అన్నట్లు

1573 తాతా సంక్రాంతి పట్టు పట్టు

1574 తాతా సంధ్యవచ్చునా అంటే యిప్పుడు చదువుకున్న నీకు రాకపొతే 60 యేండ్ల క్రిందట చదువుకున్న నాకు వస్తుందా అన్నట్లు

1575 తా దిన తవుడులేదు వారాంగనకు వడియాలు

1576 తాననుభవించని అర్ధం ధరణిపాలు

1577 తానుండెది దాలిగుంట తలచేవి మేడమాళిగలు

1578 తానిచేసిన పాపం తనువుతో తల్లిచేసినపాపం ధరణికో

1579 తానుపట్టిన కుందేటికి మూడే కాళ్ళు

1580 తానుపట్టిన కోడికి నాలుగు కాళ్ళు

1581 తాదూర కంతలేదు మడకో డోలు

1582 తాను పతివ్రతయైతే బోగమింట కాపురముంటే నేమి

1583 తానుపెంచిన పొట్టేలు తన చేతనే చచ్చినట్లు