పుట:Lokokthimukthava021013mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1347 చెడి చెన్నాపట్నంచేరు

1348 చెడిపోయిన బ్రాహ్మణునికి చచ్చిపోయిన ఆవుదానం

1349 చెడి స్నేహితుని యింటికి వెళ్ళవచ్చునుగాని చెల్లెలింటికి వెళ్ళగూడరు

1350 చెడేవాడు అబ్బడున్నాడు మరిపిడికెడుతేరా దానం చేస్తాను

1351 చెడ్డకాపరమునకు ముప్పేమిటి మొండికాలుకు చెప్పేమిటి

1352 చెడ్డచేనుకు మూడుమంచేలా

1353 చెడ్డచేనుకు యింటివడ్లు పొంగలా

1354 చెడ్డాపడ్డా చేబ్రోలేగతి

1355 చెప్పి తేసిగ్గు దాస్తేదు:ఖము

1356 చెప్పినంత చేసేవారు శివునికన్న వేరేలేరు

1357 చెప్పినబుద్దీ కట్టినబిద్దీ నిలువదు

1358 చెప్పుకింద తేలు

1359 చెప్పుడుమాటలకన్నా తప్పుడుమాటలు నయం

1360 చెప్పులవానికి చేనంతా చెప్పులు కప్పినట్లగుపడుతుంది

1361 చెప్పులు చిన్నవని కాళ్లు తెగగోసుకున్నట్లు

1362 చెప్పేవాడికిసిగ్గులేకపోతే వినేవాడికి వివేకమైనావుండద్దా

1363 చెయ్యిచూపి అవలక్షణం అనిపించుకున్నట్లు

1364 చెరుకుండేచోటికి చీమలు తామే చేరుతవి

1365 చెట్టులేనిచేను చుట్టములేనియూరు కష్టము

1366 చెట్లుమొండయితే చేరికలో వాన

1367 చెడగొట్టి శనగ ఆముదాలు