4 కవికోకిల గ్రంథావళి [స్థలం ఒకటి
సుబ్బ : ఆలాగా ? పట్టపుదేవిని మనము సూస్తే యింకా బతకడం గూడానా ?
వెంక : ఆ బక్తురాలికి రాణి వాసంలేదు.
సుబ్బ : అందరూ సూశేటట్లు పెళ్ళాన్ని యీదులు తిప్పేరాజు యేంరాజోసి తోసిరాజు !
అర్చకుఁడు : [చేతులుతట్టి] ఓయ్, పండ్లూ ఫలాలు బేడా పాతిక యేదైనా తెస్తే సన్నిధిలో సమర్పించండి. తీర్థం శటకోపం తీసుకోండి.
సుబ్బ : ఒకమూల కడుపు కాలు తుంటే శిత్తం శివుడిమీద నిలుస్తుందా యేవిటి ?
వెంక : మీరాబాయమ్మ యెప్పుడు ఇక్కడికి వస్తాదండి ?
అర్చ : ఆమె యిప్పుడు రాదు. మీరు తెచ్చిన నైవేద్యం తృణం ఫణం యీతట్టలో పడవేయండి.
[హారతిపళ్ళెము చూపించును.]
సుబ్బ : [వెంకయ్యతో రహస్యముగ] ఇక్కడిది ఇక్కణ్ణే రంగరిస్తాం. [ప్రకాశముగ] అంతా దేవుడి సొత్తేగదండి. పళ్ళు ఫలాలు ఇక్కడివే పెట్టండి.
వెంక : ఒక అణారూక పెట్టు.
సుబ్బయ్య : కాటికాపైనా తప్పినా తప్పుతుందిగాని, అర్చకుడి కట్నంమాత్రం తప్పేది కనాకష్టం. [కుచ్చె కొంగుముడివిప్పుచు] ఇంట్లో డబ్బు స్మరణా, ఈదులో డబ్బుస్మరణా, దేవళంలోకూడా డబ్బు స్మరణేనా సోమీ ?
అర్చ : [కర్పూరము వెలిగించి హారతి త్రిప్పుచు] ఏడ్చినట్లే వుంది మీ స్మరణా, మీభక్తి ! యాత్రవచ్చినప్పుడైనా పదిపాతికలు ఖర్చు చేయరాదూ ? [ఈలాటి మంత్రములతో హారతియిచ్చి, ఒక తులసిదళం ప్రసాదముగా యిచ్చును.]