38 కవికోకిల గ్రంథావళి [స్థలం ఐదు
తనలో తానే మాట్లాడుకొంటుంది. ఇప్పుడే కన్ను మాల్చింది. ఇంతవఱకు నేను విసురుతునే వుణ్యాను - కానీ, యీసంగతంతా నేనుపోయి బలవంతరావుగారితో విన్నవిస్తాను. అంతదాకా రాణిగారి దగ్గర వుంటావుగదూ ?
వాసం : ఆమాటలు చెప్పడానికి యెవరితెలివైనా యెరవుతెచ్చుకోవాల్నా యేంటి ? [నిష్క్రమించును.]
సుశీ : ఇది బహుచమత్కారి తొత్తుకూతురు. మఱచిపోయైనా మోసపోతుందంటె మోసపోదు. రేయింబవుళ్ళు నన్నే పడిచావమంటుంది.
మీర : [ఉల్కిపడిలేచి బయలుచూచు] హృదయేశ్వరా, యింతలో నా కౌఁగిలి విడిపించుకొని యెట్లుపోయితివి ? ఎచ్చటికేగితివి ? ఈదీనురాలిని వంచించుటకు నీకు మనసెట్లు పుట్టెను ? ఒక్కస్థలమున నుందువని నిర్ణయములేని నిన్ను నే నెక్కడయని వెదకుదును ?
ఉందువో మౌనిజనోత్ఫుల్ల హృదయాబ్జ
కర్ణికా నాట్య రంగములయందు?
ఉందువో శాంత రసోజ్జ్వల మూర్తివై
క్షీరాబ్ధిలో మృదుశేషశయ్య?
ఉందువో దీనావనోద్యోగ రతుఁడవై
తలపోఁత కందెడు దవ్వునందు ?
ఉందువో నిర్వాణయోగ సంధాయివై
రాస లీలా భోగరాజ్యమందు?
ఇంక నెచ్చోట నుందువో యెవరికెఱుక?
సృష్టినాటక సూత్రధారివి ! నిరంత
ప్రకృతి కేళీ వినోద హర్షంబు కొఱకు
బొమ్మరిలు గట్టి తుడిపెదు మొదలుసెడక.