పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334


కృతజ్ఞతలు

శ్రీ కొప్పరపు కవుల కళాపీఠాన్ని తమ అమృత హృదయముతో ఆవిష్కరించిన 'అవధాన సరస్వతి' శ్రీ పేరాల భరతశర్మ గారికి

డా|| గుండవరపు లక్ష్మీనారాయణ గారిని పరిచయం చేసిన మిత్రులు తనికెళ్ల భరణి గారికి

కళాపీఠం 'లోగో'ను ప్రసాదించిన 'లోగోత్తముడు' బహుకళాప్రపూర్ణుడు ' బాపు' గారికి

అన్నింటా నాకు 'పెద్దదిక్కు' భరాగో గారికి

ఈ పుస్తకమే తన మస్తకంగా సమస్తం సమర్పించుకున్న డా|| గుండవరపు లక్ష్మీనారాయణ గారికి

పుస్తకాన్ని అందంగా తయారు చేసిన రాంషా-శిరీష పబ్లికేషన్స్ యాజమాన్యానికీ, ఉద్యోగులకూ

మేమున్నాము మీవెంట అంటూ ఆర్థికంగా, హార్దికంగా సహాయం చేస్తున్న అజ్ఞాత వాఙ్మయాభిమానులకు

'కళాబంధు' M.P (రాజ్యసభ) డా]] టి.సుబ్బరామిరెడ్డి గారికి

'సాహిత్య బంధు' EX M.P (రాజ్యసభ) పద్మశ్రీ డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి

స్థితప్రజ్ఞులు' విజయ్ నిర్మాణ కంపెనీ అధినేత డా|| ఎస్. విజయకుమార్ గారికి

ఇంతమంది మహనీయుల ఆశీస్సులూ సహకారం లభించినప్పటికీ ఈ పుస్తకంలో కొన్ని అచ్చుతప్పులు ఉన్నట్లు తెలుసుకున్నాను.

దీపధారులు అని చివరి అట్టమీద కొందరు మహనీయుల రూపచిత్రాలున్నూ పుటలుvi, vii లలో వారిని గురించిన క్లుప్త పరిచయాలున్నూ చేర్చగలిగాము. అంటే మహత్తరమైన తెలుగు వాఙ్మయంలో దీపధారులు వీరే తప్ప మరెవ్వరూ లేరా అని విచికిత్స జనించవచ్చు. ఐతే, ఆకాశంలో అనంతకోటి నక్షత్రాలలో పేర్లు ఇరవై ఏడింటికే పెట్టుకోగలిగాం కదా. వీటికి నన్ను క్షమించాలి.

బుధజన విధేయుడు

'మా' శర్మ