పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

34. ఎఱఁగుడు మీదుప్రాణముల కెంతయు భారము మాదుప్రాణముల్!
     వెఱతుమె మేము? మానమునె పెద్దగఁజూతురుగాదె పండితుల్!
     ఇరవిదిమాకు మీకదిసుమీయను భేదములేదు, పండితుం
     డరమరలేక సర్వవిషయంబుల నెప్పుడుఁ బూజ్యుఁడేయగున్

35. మఱుగుకుఁబోక తప్పుకొనుమాటలనాడక, స్వోక్తి పోషణా
     దరమదియున్నఁ, బాండితి పదంపడియున్న, సభాప్రసంగమో
     సరగునఁ బత్రికాముఖపుఁజర్చయొ మీకెటబాగొ యందె యే
     ర్పఱచి భవత్తదుక్తి నిలుపందగు” నంచన మౌన మూనెడున్

36. నిరతము జీవనంబు పరనిందసుమీ! యదియేమొ! తాను స
     త్పురుషుఁడెయైనచో నొకరితో మరియిద్దరితోడఁగాదు తా
     నరిగినచోటనెల్లఁ గలహంబులె సజ్జనపాళితోడ, నో
     రరయఁగమంచిదైన జగమంతయు నప్పుడె మంచిదైచనున్

37. పరులునుగారు వారు మనవారలెపాపమటన్ వధానమున్
     జరుపఁగఁజేసిమీకు సరసంబుగ నూటపదారులిచ్చి స
     త్వరముగ గారవించి మదిఁదాపముఁబాప ధనంబు పోగుచే
     సిరి పిలువంగసాగిరది సేగియె పోరది యేమి హేతువో

38. విరతినొనంగి కుక్షిభృతి వేషపరంపర కింటిమూల, జే
     రిరొయననేల? గుండెచెదరెన్ సుమి! నెట్టిననేనిఁ వెన్నునుం
     జరచిననేనిఁ బూర్వగతి సాగదు, శక్తి యొకింతగల్గినన్
     గొఱతయె? యింకఁదోలుదురు కుండలలోపల గుఱ్ఱముల్ వడిన్

39. ఎఱుఁగవునీదు నోటిదుడుకీగతిదెచ్చెను మాయసింగమా!
     శరభనివాసమిద్దియగు, సత్యమృగేంద్రము లేవజంకెడిన్
     శరణమువేడి కాచుకొనఁజాలును బ్రాణములంచుఁ దెల్పగాఁ
     బరువెటులేనినిల్పుకొనబాగని కాలికి బుద్ధిసెప్పెడున్