పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

24. అరయఁగ గ్రంథకర్త యొకడంట! వధానియు నొక్కడంటపో!
     మఱియొకడంట యాశుకవి! మాటలుతీపివ భేదబుద్ధియే!
     మురియకుడీ! యుపాయముగఁ బోరడగింపఁగఁ పాళ్ళుసేసి ము
     గ్గురికినిబంచిపెట్టె నిదిగో కనుమా యయగారుమాన్యులే

25. పరమహితుండు కృష్ణుఁడని వంగిపురంబును జొచ్చి వేడఁగా
     శరణమతండు దాని మనసా కనకుండునె! తన్నుఁ బెద్దగాఁ
     బురమున నేగఁజేసి గురుపూజలొసంగిననాఁటి భక్తినిన్
     మఱచునె! పక్షపాతియనుమాట లవేటికిఁ బండితబ్రువా!

26. మురిపెముతోడనర్భకుల ముందిడికొంచు మహాట్టహాసముల్
     బఱపిన పెద్దవారిపనిబాగట! బాగట! యెట్టి పెద్దవా
     రెఱుగకయుండఁ బిన్నలదియేమొ యొనర్చిరటంచు నొచ్చి సుం
     దరతరవాక్యముల్ పలుక న్యాయముఁజెప్పినవాఁడవౌదువే!

27. ఉరకయె పెండ్లిపల్లకి మఱొక్కని బాలకునెక్కఁజేయు, నా
     వరుసను నెక్కునెల్లరు గుబాలునఁ బెండ్లికుమార్తెకున్ మనో
     హరులయి పుట్టిముంతురని యార్చెడి పెండ్లికుమారుఁడెంత ధీ
     వరుఁడొ! ప్రపంచతత్త్వ పరిభాసితచిత్తుఁడొ! యద్దిగాక యొ
     క్కరుఁడు మఱొక్కడింక మఱొకండును బల్వురు నెక్కుచుండఁగా
     బరువయి పల్లకీవిఱిగి పాడగునంచును మోయువారలే
     మొఱలిడరో! వధూవరుల మోములకడ్డని పెండ్లిపెద్దలే
     యరువరొ! సిగ్గుతా విడిచియాడెడి పెండ్లికుమారుఁడుండునే!

28. పఱచి యపండితుండెకద పండితగోష్ఠికి రాక డాగెడున్
     గొఱుతఘటిల్లుకీర్తికని గుట్టుబయల్పడకుండఁజేయు చా
     తురిమెయిఁదత్సభాస్థలి బుధుల్‌గలరేమొ యటంచనాక పా
     మరతను దప్పుగానిదియొ మాటికిఁదప్పని నొక్కిపల్కెడున్