పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
313

4. స్వరముననైనఁ దోపదొకొ సత్యము? బింకముఁ జూపఁగోరి “నా
   సరసకు నీవురాఁదగవు చాలునుబొ"మ్మనికూయ నంతతో
   నరుగునె? “తానుగాడిదె” నటంచు నెఱింగియె కూసెఁగాని యం
   దఱు నటుఁబిల్వ జేయవలె దానిని; గాడిదెచెంతనిల్వఁ గే
   సరికదిపోలునే తగదు సత్యము సత్యము సత్యమద్ది! యీ
   వరుసన పండితబ్రువుని వర్తన ధాత్రిఁ జెలంగుచుండదే.

5. సరసకవిత్వమద్ది సహజంబుగరావలె! పుస్తకంబులన్
   మఱిమఱి వల్లెవేసి గ్రహణప్రతిభాదులు లేశమేనియున్
   వఱలకయున్న నెట్లొ బుధనామముఁ బొందితి నింక సత్కవీ
   శ్వరబిరుదంబు వచ్చుటధ్రువంబని కష్టముమీఁద నెట్టులో
   యరుదుగఁజెప్ప బద్యమది యావురుమంచును నేడ్చినట్టులన్
   బరఁగునుజూవె! యట్టికవనం బెటులెట్టులొయల్లియాత్మలో
   మురియుటతోడఁ దృష్టిఁగనఁబోవక యాశుకవిత్వశక్తి, సు
   స్థిరతరధారణాపటిమ, ధీబలముం గనకే వధానముల్
   నెఱపఁగఁబూని త్రిమ్మరన నేటనిపించునె? యెందుఁబోయినం
   గరము పరాభవంబగునుగాని; యటంచని యూరకుండునే

6. గురువునుబోలఁగాఁదగిన కొందఱశిష్యులఁ జంకఁబెట్టి చె
   చ్చెరఁజనుచుండు, నింట మునుజేసినయట్టివియో కవీశ్వరుల్
   పరులురచించినట్టివియొ పద్యములంగొని వానిచే సభాం
   తరముల నడ్గుఁబెట్టి యవి దబ్దబ బడ్బడఁ జెప్పివేయు నిం
   కొరులిడు ప్రశ్నలల్కనయి యొప్పినవానికిసైత మెంతయుం
   జిరచిరలాడి చచ్చిచెడి చెప్పును జప్పనిపద్య మెట్టులో

7. హరిహరి! యెద్దియేని సులభాంశమెయైన జడాత్మబుద్ధికిం
   బిరుసుగఁదోపఁ దప్పుకొనువీల కటా! యెదియంచుముందుగాఁ
   గఱకఱమంచుఁ బ్రశ్న యిదిగాదిదిగాదని బోకరించు; నే