పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవా!' అనియున్నది చూడుఁడు 99. ఆద్యంతములు భగవన్నుతితో నొప్పారినవి. మణులుసూత్రమునంబోలెఁబద్యములు నాగభూపాల నామాంకితము చేయఁబడినవి. ఇందలి విషయములెక్కువగా నాగభూపాలునకు సంబంధించినవే కాన నీప్రబంధమును నాగభూపాలీయమనవచ్చును.

ఇందలి పద్యములన్నియు జిగిబిగికలిగి సముచితపదబంధ ప్రచురములై విరాజిల్లుచున్నవి. ఒక్క పద్యమైనఁగందెనలేని లాగుడుబండి చక్రమువలెనున్నది గానరాదు. దుష్కరప్రాసములతోను విపరీతభావములతోను 16 సమస్యలిందుఁగలవు. అష్టావధానములో నుండఁదగిన దత్తపది యిందుఁగలదు 94. ఏఋతువునందేపువ్వు పూచును 80. అశ్వత్ధమెందుకుఁ బనికివచ్చును 44. గ్రహణస్నానమేల చేయవలె? 39. దేవునిపై నెంతభారముంచవలె? 13. అదృశ్యుడగు దేవుఁ డుండెననుటెట్లు 52. దేవుండొక్కఁడేయనుటెట్లు 51. లక్ష్మీనివాసస్థానము లేవి? 53. ఇట్లెన్నియో క్లిష్టవిషయములిందుఁ బరిష్కరింపఁబడినవి. పంగిడిగూడెమును స్వర్గముంజేయవలె 4. ఇట్టి వర్ణనలెన్నియేని గలవు. మన భరతమాతనుగూడ వర్ణింపకపోలేదు. 34. ఇట్లే సంపూర్ణశతావధానము ప్రబంధఫక్కిఁ బరిఢవిల్లినది. అదేమిధారణాశక్తియో అనేక రాజనామములుగల 60 పద్యములెట్లొప్పగించిరోకదా! 1920లోఁ జేసిన యవధానముగూడఁ బ్రబంధపద్ధతిలో సాఁగినది. చదువురులే చూచుకొనవలయు. నా గ్రంథము పెరుగుచున్నది.

కామవరపుకోట, లక్కవరము, జంగారెడ్డిగూడెము, అశ్వారావుపేట, హైదరాబాదు, నెల్లూరు, మద్రాసు, కాకినాడ మున్నగు ననేకస్ధలముల నొనర్చిన యవధానములేమైనవో? తెలియదు.

వీరు రాజుల సందర్శించి రాజసన్మానములొంది, గజారోహణాది రాజభోగము లనుభవించిరి. అది యొక మహోన్నత దశాకాలము. అదియొక మహారాజ యోగము.

xxxv