పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290


కొప్పరపు సోదరకవులు - ఆశుకవిత

కాకినాడ

మనోరంజని

15-7-1912

కాళ్ళకూరి నారాయణరావు

...... ఆశుకవిత్వము లోకమున కుపయోగించునది కాదఁట! భాషను బాడుచేయునంట! బంధకవిత్వము వలనను గర్భకవిత్వము వలనను లోకమునకేమి యుపయోగమున్నదో! ఈ కాలములో నష్టావధానులు శతావధానులు నొంటిగను జంటగను గుప్పతిప్పలుగా బయలు వెడలుచున్నారు గదా! లోకమునకు వీరి యవధానములవలన నేమి ప్రయోజనము కలిగినదో! కలుగుచున్నదో!! కలుగఁ గలదో!!!

[1]"రవికెల గుడ్డలు చొక్కల గుడ్డలు రంగుగ గుట్టెడువారలకున్
సవరుగ దొర్లకు నెత్తులమీఁదను క్షారముచేసెడి వారలకున్
భవనములందున దివ్వెల నెప్పుడు బాగొనరించెడు వారలకున్
మివులుగఁ గత్తెర కావలయుంజుమి మిత్రుఁడ వింటివె మేదినిలోన్”

  1. ఇది, కొమ్ములు తిరిగిన యొక యవధానిపుంగవుల జత, యవధానము నందుఁ గత్తెరమీఁదఁ జెప్పిన పద్యము. ఇది నాకడనున్నందున సోదరకవులిచ్చట నున్న దినములలో నొకప్పుడు వీరెట్లు చెప్పుదురో చూతమని కత్తెరపై నొక కవిరాజ విరాజితము చెప్పుడని యడుగ, వారున్నపాటున నాశువుగా నేడెనిమిది పద్యములం జెప్పిరి. వానిలో నొకటి యీ దిగువ నుదహరించు చున్నాఁడ.