పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

తిరుపతి శాస్త్రిగారు ఈ పద్యము చెప్పినది, కొప్పరపు సోదర కవులను దృష్టిలో పెట్టుకొనీయే కదా! ఈ పద్యమును విని ప్రక్కనే యున్న కొప్పరపు సుబ్బరాయకవి ఆగ్రహముతో చెప్పిన పద్యమిది.

అలవోకన్ గవితా సరస్వతికిఁ గల్యాణంబుఁ గావింప ....
.... తొండమున్ ముడిచి పర్వుల్ దీయు నేతత్ గజం
బుల సింగంబుల నొక్కరేవున జలంబుంద్రాగఁగాఁ జేసితే
అలఘూద్యత్‌ధిషణా! వినిర్జిత సురేజ్యా! పూజ్య విద్యానిధీ!

ఈ సంఘటన తరువాత మరల ఈ యుభయ కవి యుగళములు కలసి కొనలేదు.

6. ఏలూరులో శ్రీ రాజా మంత్రి ప్రెగడ భుజంగరావుగారి యింటి గడపను దాటుచుండగా, కావలెనని ఒకడు తుమ్మగా సుబ్బరాయకవి ఆగ్రహముతో చెప్పిన పద్యము -

కైటభాంతకు నిరాఘాట శంఖ రవంబు
           విన్నంగాని విభీతి నున్నవాని
గాండీవధరు జయోద్దండ కాండాహతిఁ
           దిన్నంగాని చలింపకున్నవాని
కాలకాలుని ఫాల కీలి కీలాలంబు
          గన్నఁగాని యెదిర్చియున్నవాని
సంభోధి సంభవ హాలహలంబు పై
          కొన్నఁగాని కలంగ కున్నవాని

విందుమే గాని వినమెందు విశ్వలోక
భూత సంఘాత ఘాతుక భూతనిశిత
పటపటాత్కార దంష్ట్రికా పటల చటుల
భీకరాభ క్షుతారవాపేత భీతు