పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినందిస్తున్నాను. సోదరకవుల కవిత్వాన్ని ప్రచారం చేయటానికి కంకణం కట్టుకొని దానికోసం ఒక సంస్థను స్థాపించి అనన్య సామాన్యమైన కృషి చేస్తున్న (ఆశుకవిచక్రవర్తి కొప్పరపు సుబ్బరాయశర్మగారి దౌహిత్రుడు) సుబ్బరాయశర్మ గారిని మనఃపూర్వకంగా ప్రశంసిస్తున్నాను. ఈ గ్రంథంలో ఉదహరించని వేదం వేంకట రాయశాస్త్రి గారి పద్యాన్ని ఉదహరిస్తూ ముగిస్తున్నాను. ఇది మంత్రిప్రగడ భుజంగరావు గారి కుమార్తె వివాహ సందర్భంగా జరిగిన సోదరకవుల ఆశుకవితాసభకు అధ్యక్షత వహించినప్పుడు వేదంవారు చెప్పిన పద్యం.

ఎవ్వరిని మెచ్చువాడ గానెపుడు నేను
మెచ్చితిని మిమ్మెజగములు మెచ్చినట్లు
ఆశుకవితాశిఖామణులందు మిమ్ము
సూరివరులార! కొప్రంపుసుకవులార!