పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ధైర్యముచేసి అర్ధరాత్రివేళయైనను నొక్కడనే యూలుదొరగారి బంగళాయొద్దకు బోయి, మేడమీద పడుకొనియున్నవారిని గట్టిగా కేకలువేసి లేపి, చంద్రశేఖరము ప్రాణాప శిష్టుడుగానున్నసంగతి చెప్పి కుగ్లరుదొరసానిగారిని తీసికొనిరమ్మని అతని బంధువులు తెలిపి రని పలికితిని. అంతట యూలుదొర, దొరసానిగారిని నాతోకూడ అప్పుడు ఊరివెలుపల నొక మిషన్‌బంగాలాళో నివసించుచున్న కుగ్లరుదొరసానియొద్దకు బంపెను. ఊలుదొరసాని కుగ్లరుగారిని లేపి విషయములు తెలియజెప్పగా వెంటనే నేను తెచ్చిన యొంటెద్దుబండిమీద పాతగుంటూరువచ్చి, రోగిని చూచునప్పటికి అతనికి బొత్తిగా మాటపడిపోయి, మనుష్యులను గుర్తించుట దుస్సాధ్యముగ నుండెను. అప్పు డామె ఇన్‌జెక్షన్ ఇచ్చినపిమ్మట కొలదినిముషములకు తెలివివచ్చి రోగి మెల్లగ మాటలాడ నారంభించెను. అందరికిని ధైర్యముకలిగెను. ఆమె ఇంటికి వెళ్లెదనని పోబోవుచుండగా ఆతని బంధువులందరును తగిన ఔషధ మిచ్చి జాడ్యము నయము చేయవలసినదని ఆమెను కోరిరి. ఆమె "నేను చెప్పినప్రకారము పథ్యపానములు జరిపి క్రమముగ ఔషధసేవచేయుట ఇచ్చట నెవ్వరికిని అభ్యాసములేదు. చెప్పినప్రకారము నడిపించనిచోట ఔషధమిచ్చుట ప్రయోజనములేదు" అని చెప్పివేసెను. ఆమెకు అప్పటి కింకను తెలుగుభాష రాదు. నేనే ఆమె చెప్పినమాటలను తెలుగులో రోగిదగ్గరనున్న బంధువులకు తెలియజెప్పితిని. అంతట వారు ఆమె చెప్పినప్రకారమే క్రమముగా ఔషధసేవయు, పథ్యపానములును నడిపెదమనియు, ఆమెయే ఔషధమీయవలెననియు ప్రార్థింపసాగిరి. ఆమె తుదకు నన్ను బిలిచి నీవు క్రమ