పుట:Kavitvatatvavicharamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 63

నష్టమును బూరించుకొందమను నాశను వదలుకొని రే మో ! ఇట్టి పశ్చాత్తాప కాలమున బుద్ధి యెట్లుపారును ? హృదయ మే యానం దము దొరుకునని వికసించును ? కావున నన్నిశక్తులుఁ బోయి పండితులకు నేకశక్తియైన జ్ఞానశక్తి మాత్రము మిగిలెఁ గాఁబోలు ! అసలు పూర్తిగా నడుగంటని వసుచరిత్ర కాలములో నున్నంత ప్రజ్ఞయు, మగంటిమియు తరువాతి నాళ్ళవారమైన మనకు నంద రాని వైనందున నేమో రసహినములు, ఏక క్రమములు, అనవ్య ములునైన కావ్యములు పుంఖానుపుంఖములుగ వెడలినవి! ఇవియు లేక పోయి యుండిన దేశము పరిపూర్ణాంధకారముపాలయి యుండుఁ గాన, నీ మాత్రము వెలుతురైన నిలపినందులకుఁ బండితులను బాళయ గాండ్రను మనము కొనియాడవలయం.

                          ఐరోపా లో రాజులు నాశన మెత్తినను ప్రజయను నింకొక ప్రకృతి ప్రతాపవంతమై యుండుఁ గావున, కవిత కేవలము నగరి నా శ్ర యించి బ్రదుకు విద్యగాదు. హిందూదేశములో మనుస్మృతి దెబ్బ దగిలిన నాఁటినుండి ప్రజ యీవఱకును లేవలేక పడియున్నది. దానిది పరాశ్రయమైన బ్రతుకు ! కృష్ణదేవరాయలు, శివాజీ వీరిం బోలిన మహనీ యు లవతరించి రేని, జనసామాన్యమును వారి వెంట కుక్కలగుంపువలెఁ బోయి యెవరిమీఁదఁ బడుమన్నను బడును గాని, నాయకులు లేనిచో దిక్కులు దెలియక మరలC బ్రాచీన కర్మమును బారంపర్య హీనస్థానమును అవలంబించును.
                            “క. ఏమీ ! రాజులు మంత్రులఁ
                                 దామతి దుర్బుద్ధులైన ధరయెల్లను గ్రిం
                                  దై మాఁడి మడియునో ! జన
                                 సామాన్యము సంపు చరిత చక్కనిదైనన్."
                      మనవారిలో సంఘచరితమను భావమే యున్నదో లేదో ! భావమే లేనిది ప్రవృత్తి యెక్కడిది ? తమ తమ కుటుంబములయు, తెగలయు  క్షేమచింతయే గాని రాష్ట్రము గూర్చిన చింతలు లేని వారగుటం జేసి, వీరి ప్రారంభములచే దేశమున కే మాత్రము మాన ప్రాణరక్షణములు సమకూ అవు. అట్లగుట వీరి కృత్యములు గంభీ రోద్యమములు. వీరిచేఁ దెలివియు విరివియు c గాంచు కవిత సాధారణ జనులపై నేల దృష్టి యుంచును ? తన కడుపుమీద దప్ప నింకెద్దానిమీదఁను గన్ను మనసుc బోనివానిపైఁ బరుల కన్నులు మనసులు నేలపాఱును చీయని వాపోవుటకుఁ దప్ప ! ఐరోపా