పుట:Kavitvatatvavicharamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 కవిత్వతత్త్వ విచారము

మాట ! ప్రకృతిని గాదనుట తెలిసియో తెలియక యో కట్టుకొన్న మగవారి కెల్లఁ దెలియును. పాశ్చాత్యులు మనుష్యజీవిత పరిశీలన సమర్ధులగుటను, స్వయంవిమర్శమై వ్రాయువారు అగుటను, కాల సృష్టి పరిణామముల వర్ణించుటలో నద్భుత చరిత్రులు ! కాలో చిత్య మున నర్ధములు రెండు. ప్రతిపాత్రమును గాలానుగుణ పరివర్త నములకుఁ బాత్రమైనట్లు వర్ణించుటయు, కథలోని వివిధ సందర్భ ములు కాలముతోఁ జేరికగలవిగా నుండునట్లు గల్పించుటయు ననునవి. ఇందు ప్రథమ భావముమీఁద వివరించితిమి. ద్వితీయా ర్ధమునకు సూరనార్యునే నిదర్శనముగాఁగొని వ్యాఖ్యానం బొనర్తము. కళాపూర్ణోదయములోని సందర్భములకు కాలవిషయమునఁ గల పరస్పరాసాంగత్యము పాటింపుఁడు ! నారదు (డు మణికంధరుఁడు శ్రీకృష్ణుని యాత్రితులు. మణికంధరుఁడు కళాపూర్జుఁడు గాఁబుట్టి దిగ్విజయముఁ జేయుసరికి ద్వారకాపుర సముద్రములో మునిఁగి పోయి యుండెను. అనగా కళాపూర్జుఁడు రాజ్యము చేసినది కలి ప్రారంభము ననుకొందము. ద్వాపరాంతమునన్నను బాధకము గాదు. అప్పడు పిరంగులుఁ దుపాకులు నెక్కడివి ? రెండవది రుక్మిణీ కాంతునికిఁ దరువాత నీ రాజు వలె సద్గుణు లెవ్వరు లేరని కురుకాది దేశాధీశులు కానుకలు పెట్టినారఁట; పాండవుల మనుమ డైన పరీక్షిత్తు సార్వభౌముఁడాయెనని జగత్ ప్రసిద్ధమగు కథ యుండఁగా,నీ కళాపూర్ణుని వానితోఁ బోటీకిం బెట్టుట "కొండంగని తగరు దాఁకఁ గోరుట గాదే !" ప్రపంచ ఖ్యాతములగు కథలతో విరోధించినట్టి కల్పనలు అయోగ్యములు.

               సుగ్రహుండు ఎన్నెన్నో తపస్సులుచేసి యవస్థలుపడి హారము పడసిన వాఁడు. పిమ్మట నా హారము ఒక బ్రాహ్మణుని యి Oట నెన్నియో యేండ్లుండినది. తరువాత నాయో ( గృష్ణార్పితము. &9 వెనుకc గృష్ణునిచే మణికంధరునికి లభించినది. వా ( డు గానవిద్య, యాత్ర, తపస్సు — ఇత్యాదులలోఁ గడపిన వత్సరములు కనీసము ఆఱు. అట్లగుట మణికంధరునియొద్దఁ జేరినది మొదలు మధుర లాలస రెండవ తూరి ధరించువఅకు జరిగిన యేండ్లు సుమారు ఇరువదినాలు. ఇఁక సుగ్రహుని వయస్సెంత యుండునో యూహింప నలవిగాదు. అట్టి దీర్ఘాయుష్మంతుఁడగు సుగ్రహుఁడు సత్త్వదాత్ముం డను పేరంబరిగినవాఁడు. మధురలాలసకు మేనమామ ! సుగ్రహు నింగూర్చిన యూభాసముల క్రింకను ముగింపుగానము. రూపానుభూతి యతని నెఱింగి యుండకపోవుట సిద్ధము ! శాపంబుచే మతి