పుట:Kavitvatatvavicharamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 కవిత్వతత్త్వ విచారము యాకారము రంగులు దీఱి యేదే నొక విగ్రహముగ మనసున పత్రి

ఫలించును. ఇట్లు గాక పేరు ల జాపి తా యెదుట నుంచిన, మన 

మేమి వర్తకులమా దానియెడ నా చర ముంచుటకు ?

         సమష్టిగా వ్రాయుట నిఘంటుకారుల పని. వ్యక్తి నొకదాని
హృదయమున సాక్షాత్కరింపఁ జేయుట కవి యొక్క ముఖ్యోద్యమ 

ములలో నొండు. ఇది చేయంజాలని వా Cడు పండితుఁడు గా

వచ్చునే గాని కవిగా నేరcడు. తన మనసులో నే దే నొక యాకృతిని
చక్కఁగ నేర్పఱచి పదములమూలముగ దానిని రసికులకు వ్యక్త
పఱిచిన నదియ కవిత్వము. నదిని వర్ణించిన నన్ని నదులకుం 

జెందిన తీరు నఁ జేయుట కళ గాదు. మఱి యే దే నొక్క తెఱం

గగునది దో (పవలయు. అ ప్లే సరస్సులు మొదలగు ప్రకృతి
మూర్తులం గూర్చియు.
       పాత్రముల వర్ణించునపుడును ఈ తత్త్వము నేమాత్రము
మఱవరాదు. ప్రబంధ కవులలో ననేకులు వసుచరిత్రాను కారులు.
పద్ధతి నే మాత్రముఁ దెలియనివారు. వీరినాయికలు పరస్

పప్రతిబింబములు. ప్రత్యేకించిన గుణము, చర్య, రూపము, ఏదియు లేదు. నాయకులు నమ్టే.

       కవులు వర్ణించిన ప్రకృతులు పాత్రములు నుత్కృష్టములా
యుని శోధించుట కొక యుపాయమున్నది. ఏదన. ఆ వర్ణనలC
జదువుటచే చిత్రకారుఁడు విస్పష్టమును అనన్యమునైన ప్రతిమను
వ్రాయఁగలడా యుని వితర్కించుట. బమ్మెర పోతనామాత్యుని
వనములు సరస్సులు నన్నియు గురిగింజలట్లు ఏక రూపములు.
ఏక రూపము అనుటయు C దప్ప ఏక నామము లన్న నింకను
సత్యము ! ఏలన నిఘంటువులలోని పేర్లున్నవిగాని, యుయ్యై
వస్తువులకుఁ గాలాదుల ననుసరించిన చర్యలెవ్వియు నా రోపింపఁ
బడనందు న నవి దృష్టములు గావు.
         పాత్రములC బరిపూర్ణములుగా వర్ణించుట యెంత తప్
వనాదుల సైతము" సర్వలక్షణ సంపన్నా"ముల (గా వర్ణించుట 

యంత తప్ప. పోతన యొక్క చెట్లన్నియు C బుట్టి పెరుగు తా

వీజగతి నొక్కటే ! ఎద్దియన. నిఘంటువు ! భూసారాది తారతమ్య 

ముల చేత నొక జాతికి వృద్ధికరమగు నేల యింకొక దానికి క్షయ

కరము. మఱియు ఒక నేలలో పెరుగు వృక్షములు సైతము
సరిగా నాయి కా నాయకులు వచ్చునది చూచి యన్నియు C బుష్పఫల
భరితములు గావు. వనములు, తోఁటలు మొదలగునవి చూచిన