పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కవికోకిల గ్రంథావళి


తన్నుఁ దానే కుదురుపాటునఁ బొడుచుకొనెను గావున “ఆయపుఁ బట్టు' చూచి పొడుచుకొనెను. అప్పటికిని గ్రుక్కు, మిక్కు మనక చావలేదు. తన విషాదమును వెలిపుచ్చు మాటలు పలికియే మరణించెను. ఇచ్చట కుమారుఁడు మహోపన్యాసము నొసఁగ లేదని కాఁబోలు రసలుబ్ధుని కొఱఁత!

కుమారసింహుఁడు కుంభుని చీఁకటిమఱుఁగునఁ బొడిచెను. ఆ సమయమునకుఁ దనవైపున కేప్రక్క కనఁబడుచుండెనో ఆ ప్రక్కనే పొడిచెను. బహుశః వెనుక ప్రక్కగ నుండవచ్చును. ఆ పోటు సద్యోమరణ సంపాదికాక పదినిమిషములు బ్రతుక నిచ్చునదిగా నుండును. ఇందేమి నిర్వహణంపు తబ్బిబ్బు కనఁబడుచున్నది ? అది యెచటనున్నదో రసలుబ్ధుఁడు తన బుద్ధిని శోధించుకొనవలయును.

(9) {A} ఒకే విధమైన యాక్షేపములు చర్విత చర్వణముగ అందందుఁ దలయెత్తుచున్నవి. అందువలన నేనును బునరుక్తిదోషమునకు అగ్గము కావలసి యున్నది. రాణా హేతువాదియని యిదివఱకె తెలిపియుంటిని. మీరా మతము నెడ నతనికి సహానుభూతిలేదు; తన గార్హస్థ్య సుఖమునకు భంగము కలుగుటవలన మత ద్వేషము మఱింత నిశితమైనది. కాని, యా మతద్వేష మొక్కటియే యైన ఇట్టి ట్రాజెడీ జరిగి యుండదు. అగ్బరు అంతఃపురములోనికి వచ్చుటయె ట్రాజెడీకి కారణము. మీరా ప్రసిద్ధభక్తి అగ్బరును రప్పించుటకు హేతువైనది. రాణా మీరాను శిక్షించుట తనమతము కన్న భిన్నమతము నవలంబించినందుకుఁగాదు; అగ్బరుపై మరులుగొన్నందుకు. అగ్బరు ఒట్టుపెట్టుకొని చెప్పిన మాటల