పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

అనార్కాలి

181


       కనుబొమల్ ముడివడెఁ; గను లెఱ్ఱనాయె;
నిరయ ధూమంబట్లు నిట్టూర్పు వెడలె;
ఒడలెల్లఁ గంపించె; నోర్పు నశించె;
నగ్బరు పాదుషా యసురయై నిలిచె! 60
         అయ్యయో! చల్లని యంబుద చ్ఛాయ
నటియించు నెమిలిపైఁ బెటిలెరా పిడుగు:
నర్తకి పదములు నాట్యంబు మానె;
వీణా నినాదంబు విశ్రాంతి గొనియె;
బానిస లెల్లరు భ్రాంతులై చనిరి;
చంచలా లతిక నిశ్చలత మ్రాన్పడియె;
నందఱిమోముల నడలు గన్పట్టె;
మధుపాన పాత్రికా మర్మరధ్వనులు
శమియించె, సభ్యులు క్షణములో నేటకో
జాఱిపోయిరి, జహాంగీరు నర్తకియు 70
నగ్బరు దప్ప నింకచట లేరెవరు.
కనుఱెప్పపాటులోఁ గమనీయ దృశ్య
మాభీల మరుదేశ మట్లు మార్పడియె,
కుపితుఁడై యగ్బరు కొడుకును గాంచి;
'ఓరోరి దుశ్శీల, యో నీతిహీన,
ఆభిజాత్యం బేడ? ఆతొత్తు కూఁతు