పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

పండితప్రతిజ్ఞ

173

'వాల్మీకి ముసలితాపసి యయ్యు ననుఁ గూడి
         రమణీయ కళలఁ గరంచి యేలెఁ;
గాళిదాసుఁడు బిగ్గఁగౌఁగిట లాలింప
         శృంగార భోగ నిర్వృతిని గంటి
భవభూతి పాండిత్యపటిమతో శాస్త్రస
         మ్మతముగ ననుఁ గూడిమాడినాఁడు;
భట్టబాణ మయూర భారవి ప్రముఖులు
         దివ్యభూషాపేక్ష దీర్చినారు;

నన్నపార్యుఁడుఁ దిక్కన మున్ను గాఁగఁ
దెలుఁగుఁగవు లెల్ల నాముద్దు సలిపినారు;
ప్రాఁతవారల యనుభోగ్యపటిమ సడలఁ
గ్రొత్తగోవాళ్ళ నాసించి కూడుచుందు.'

అన విని పండితుం డనును: 'నందఱ ముంచిన ప్రాఁతలంజ వ
య్యును బడుచుందనంబుఁ గనులోరలఁజూచెడి ముద్దరాలిసొం
పును, దనుసౌష్ఠవంబు, వలపుంబస, లెట్టులుగాచి యుంచితో
వనిత? శరీర రమ్యతకు బ్రహ్మ వినీతిని గూర్పఁ డేలొకో?'

అనుచు గ్రంథంబు లెల్లను నట్టె జవిరి
మూటముల్లెగ సవరించి: 'పొలఁతి, నేను
బోయి వచ్చెద, మన పొందు పొసఁగ ' దనినఁ,
జెలియ చిఱునవ్వు నవ్వుచుఁ జెంతఁ జేరి: