పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

32

నుండుటం బట్టియు, వృత్తనియమములఁ బాటింపశక్తిలేనివారు సీసాది జాతులలోనే పద్యము లల్లవచ్చును గనుకను, నందుకును జాలనివారు గద్య కావ్యములు రచించుట కాక్షేపములేదు గావునను యతిప్రాసనియమము త్యజించుట కాంధ్రలోక మంగీకరించు నని తోఁపదు.

జయంతి రామయ్య.


___________


ద్వితీయముద్రణపీఠిక.

ఈగ్రంథము తొలుత 1917 వ సంవత్సరములోఁ బ్రకటింపఁబడినది. అప్పు డచ్చుపడిన ప్రతు లన్నియు వ్యయపడుటచే నిప్పుడు తిరుగ నచ్పు వేయింపఁబడినది. ఈద్వితీయముద్రణమునందు మూలపాఠములోఁ గొన్ని చిన్నిమార్పులు చేయఁబడినవి. అవి యేవి యనఁగా. __

అవతారికాపద్యములలో మొదటి పద్యము ప్రక్షిప్తములలోఁ జేర్పఁబడినది. వృత్తాధికారమందు 136 వ పద్యము తరువాత పరస్థానార్థసమవృత్తములలో” అను శీర్షిక క్రొత్తగాఁ జేర్పఁబడినది. ఈక్రింద సూచింపఁబడు పద్యములలోఁ