పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

కవిజనాశ్రయము

వృత్తము లనియు, విషమవృత్తములనియు వృత్తములు మూఁడు విధములు. గణసంఖ్యయందును, గణక్రమమునందును నన్ని పాదములు సమానముగా నున్న వృత్తములు సమవృత్తములు. రెండుపాదము లొకవృత్తమునకును మఱిరెండుపాదములు వేఱొకవృత్తమునకును సంబంధించినచో నావృత్త మర్ధసమ వృత్తము. అట్టివృత్తములు రెండు నేకచ్ఛందములోఁ జేరినయెడల స్వస్థానార్ధసమవృత్త మగును. ఒకవృత్త మొకఛందములోనిదియు నింకొకటి యింకొకఛందములోనిదియు నయిన పక్షమున నది పరస్థానార్ధసమవృత్తము. నాలుగుపాదములును బరస్పరభిన్నములుగా నున్నవృత్తము విషమవృత్తము. విషమ వృత్తములకుఁ గూడ స్వస్థానపరస్థాన భేదము కల్పింపవచ్చునని తోఁచెడును. సమవృత్తముల సంఖ్యయే ప్రస్తారక్రమమున 134217726 అగును. అర్ధసమవిషమవృత్తములం జేర్చిన మొత్త మెంతయగునో గణితజ్ఞులు గణింతురుగాక ! వృత్తము లన్నియు సంస్కృతచ్ఛందమునుండి గ్రహింపఁబడినవియే.

- జాతులు. -

మాత్రాగణములవలనఁ బుట్టినవి జూతులు. ఇందుఁ గందాదులు కొన్ని సాంస్కృతికములు. సీసాదులు దేశ్యములు. గీతాదుల కుపజాతు లనుసంజ్ఞకూడఁ గలదు. దేశ్యజాతులలో సూర్యేంద్రచంద్ర గణములు మాత్రమే వచ్చును. అక్కరలు మొదలగు కొన్ని దేశ్యజాతులు కన్నడమునందును గలవు.

అల్పాక్కర, అంతరాక్కర , మధురాక్కర , మధ్యాక్కర, మహాక్కరయని యక్షర లైదు తెఱుఁగులు. అల్పాక్కరకుఁ బాద