పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

కవిజనాశ్రయము

ఈహేతువు లన్నిటింబట్టి భీమకవి వెలిగందలసీమవాఁడు, గాని, గోదావరీమండలమువాఁడు కాఁ డని యూహింపఁ దగియున్నది.

-: భీమక వి కాలనిర్ణయము :-

ఇక భీమకవికాలమును నిర్ణయింపవలయును. పూర్వో దాహృత మగు-

మ. ఘనుఁడ న్వేములవాడ వంశజుఁడ దాక్షారామభీ మేశనం
     దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుండ భీ
     మననా పేరు వినంగఁ జెప్పితిఁ గళింగాధీశ కస్తూరికా
     ఘనసారాదినుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.

అనుపద్యము మూఁడవపాదములోఁ గొంచెము పాఠభేదముఁ గల్పించి యదియే ముఖ్యాధారముగా భీమకవి నన్నయ భట్టుకంటెఁ బూర్వుఁడని గురుజాడ శ్రీరామమూర్తిగారును, ఈ పద్యమును మఱికొన్ని పద్యములను నాధారము చేసికొని భీమన పదునాల్గవశతాబ్దమువాఁడని కందుకూరి వీరేశలింగముపంతులుగారును వ్రాసినారు. ఈ రెండుమతములుగూడఁ నసమ్మతములే. శ్రీరామమూర్తిగారి పాఠముప్రకారము పైపద్యములో “భీమన నా పేరు వీనంగఁ జెప్పితి వెలుంగాధీశ” యని యుండవలయును . “వెలుంగాధీశ” యనఁగా "విమలాధీశ” యని యర్థ మఁట ! విమలాధీశుఁ డనఁగా రాజనరేంద్రునితండ్రి యఁట ! 'ఈ హేతువుచే భీమన నన్నయభట్టుకంటెఁ బ్రాచీనుఁ డట ! ఈ వాదమందెన్ని దోషము లున్నవో చూడుఁడు. రాజనరేంద్రునితండ్రి విమ