పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కవిజనాశ్రయము.

మంగళమహాశ్రీవృత్తము. -
     శ్రీమహిత ! లోకహిత ! శిషజన సేవిత !
          విశిష్టగుణ ! మంగళమహాశ్రీ
     [1]నామ మగు నబ్భజసనంబులకడన్
          భజసనంబులు గగంబులు పెనంగన్. 124

     [2]క. కమనీయంబగు నీక్రియ
     సమవృత్తము లిరువదాఱుఛందంబుల నీ
     క్రమమున మల్లియరేచన
     రమణీరమణీయరమణరమణుఁడు చెప్పెన్. 125

- ఉద్ధరమాలావృత్తములు. -



     క. పరఁగఁగ నిరువదియాఱ
     క్షరముల కగ్గలము చెప్పఁగాఁ బాదము లు
     ద్ధరమాలావృత్తములై
     పరఁగు లయగ్రాహి లయవిభాతి యనంగన్. 126

  1. ద-నామమునకున్ భజసనంబులు పెనంగు నసునామ యతి రెట్టిగఁ దుదిన్ గాన్.
  2. ఈపద్యము పిదపఁ జాల ప్రతులలో నీక్రిందిపద్య మున్నది. చ. ఒగిఁ బదుమూఁడు కోటులును నొప్పుగ నల్వదిరెండు లక్షలున్, దగఁ బదియేడువేలు విదితంబుగఁ దానట నేడునూటిపై, నగణితవైభవా ! యిరువదాఱగు సంఖ్యఁ జెలంగి యొప్పెడున్ , సగుణిత యిర్వదాఱు నగు ఛందములన్ సమపాదవృత్తముల్ . డ-లో- 3, 4 పాదములు. అగణితవైభవా ! యిరువదాఱగు సన్నుతపాద వృత్తముల్, జగమున నెన్ని చూడఁగ విశాలయశోనిధి రేచధీమణీ !