పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాశీమజిలీకథలు - మూడవభాగము

గొందరుచేడియలు పూవులు గోయుచు జమత్కారముగా నిట్లు మాటాడు కొనుచుండిరి.

మనోరమ - మధురికా! దాడిమీఫలముల బక్షులు దినకుండ బైనముక్తాఫలంబులం గట్టితివా ?

మధురిక - రాజపుత్రీ! కట్టితిని ముక్తారత్నాభిరామంబులయి నఖక్షతంబుల నెఱుంగని భవదీయకుచంబులుంబోలె నవియు బతంగ త్రోటిపోటులం గాంచమి మిక్కిలి శోభించుచున్నయవి.

మనోరమ - పరిహాసవతీ 1 నీ వెప్పుడు డిట్లే పలుకుచుందువు. ఈతిలకంబు పూయలేదేమి?

మధురిక - పూబోడీ! నీ వొక్కసారి కన్నెత్తి చూడుము.

మాలతిక - యువతీ! పుష్పవతిఅగు నీ గోరంటను ముట్టితిని. తద్రజోదోషంబు నిన్నంటె. నన్నంటకుము.

పల్లవి - మాలతికా! నీవు చతురవే కాని, నీ పయ్యెదం దొలంగించుచున్న తత్కంటకోసద్రంబు దప్పించుకొనుము.

వసంతిక -- పల్లవికా! మన రాజపుత్రిక చేతులు పైకెత్తి పూవులుగోయుచుండ నా చెన్ను జూచితివా!

పల్లవిక - వసంతికా! మనకే మరులు గొలుపుచున్నది గదా కుసుమకోమలమైన యీ జవ్వని యౌవనం బనుభవింప నెవ్వడు తపంబు చేయుచున్నాడో?

మనోరమ - చెలులారా! మీరు పూవులు కోయుటమాని యనవసరప్రసంగము చేయుచున్నారు ఆయశోకమునకు దోహదము చేసితిరా?

మధురిక - అది నీచరణతాఁడనంబునంగాని చక్కఁబడదు.

వసంతిక - సఖీ! ఈ కామదేవపటం బీపాటికి బూజింతమా! పూవులుమిక్కుటముగా గోసితిమి.

మనోరమ - సఖులార. ఇప్పుడు కాదు. పుష్పాపచయంబున మన మేనులు చెమ్మటలు గ్రమ్మినవి జలక్రీడం దేలిన తరువాత బూజింతము. అనుటయు ..........................నొక్కపెట్టున అంటున్న తటాకంబునం బడి నీదులాడుచు రాజపుత్రికతోగూడ బెద్దదడవు గ్రీడించిరి. అంతలో సాయంసమయ మగుటయు నాట చాలించి యమ్మించుబోడులు తమ తమ పుట్టంబులం గట్టుకొని యింటికిం బోవుటకు అంతకుమున్ను వచ్చియున్న అశ్వశకటంబు లెక్కిరి.

అప్పుడు కందర్పుడు కొమ్మల మాటునుండి వారివిహారమును గ్రీడలుమాటలు రూపములు యౌవనములు కన్నులార జూచి స్మరశరవిద్ధహ్మదయుండై హృదయంబున అయ్యారే! యిది భరతఖండమని వీరి మాటలవలనం దేటయైనది. ఈ పాటలగంధుల నడుమ మనోరమ మనోరమయై మెరయుచున్నది. అదియే రాజపుత్రిక.