పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

37

రహస్యముగా రప్పించితిని. అతని భాగ్యాతిశయము నీవు వినియేయుందువు. వారిప్పుడు నాపేరగట్టిన సత్రములో బీటలు వైచుకొని సిద్ధముగానున్నారు. నీకొఱకు పుట్టిక నల్లించితిని. దానిలో గూర్యుంటివేని చేటికి నెత్తిపై నిడుకొని యచ్చటికి దీసికొని పోగలదు. పైకిజూడ దమలపాకుతట్టవలె దోచును. ఇమిడిగా నుండుటచే నీవు దానిలోనున్నట్లే తోచదు. నీకును శ్రమముగాఁ నుండదని చెప్పిన విని నేను స్త్రీనే గనుక స్త్రీచాపల్యం బెట్లు వొడమకుండును?

ఆమె మాటలు తీసివేయలేక నేనందులకు సమ్మతించితిని. ఇంతకు దైవమిట్లు చేయదలచికొనియుండ వేఱొకబుద్ది యెట్లుపుట్టును.

మాతల్లియు, సుముహూర్త మాసన్నమగుచున్నదని యాప్తుడగు దైవజ్ఞుడు చెప్పినంత న న్నాగంపలో నిమిడికగా కూర్చుండబెట్టి సన్నని మూతిపై మూతగట్టి యొకదాది నెత్తిమీద బెట్టి యా సత్రమున కనిపినది.

ఆకుసూలమునకు రంధ్రములు గలిగియుండుటచే లోపలకు గాలి వచ్చుచున్నది. దానంజేసి నాకేమియు గష్టముగా లేదు. తరువాత నాదూతిక యాగంప నెత్తిపై నిడికొని యాకోటదాటి వీథివెంబడి యరుగుచుండెను.

కోటసింహహద్వారమున గాపున్న రాజకింకరులు దానిని రాణిగారి చేటికగా నెఱిగియున్న వారగుట బ్రశ్నచేయక పోనిచ్చిరి.

అట్లది నన్ను నెత్తిపై నిడికొని యొకవీధిఁ బోవుచుండగా నప్పుడఁ దొకచోట హటాత్తుగా నిండ్లంటుకొని చటచ్చటారావములతో మంటలు నలుదెసలం గ్రమ్ముచు భువనభీషణమై యొప్ప నప్పుడు పౌరుల హాహాకారనినాదములు భూనభోంతరాళములు నిండినవి మఱియు నాప్రాంతమందుగల గృహములలోనున్న వస్తువాహనసామగ్రి అంతయు నారాజమార్గమున జేర్చుచుండిరి.

దానంజేసి యావీథియంతయు గృహోపకరణములచే నిండి యడుగిడుటకు తావులేకపొయినది. అట్టియలజడిలో నాదూతిక గంప నెత్తిమీద బెట్టికొని జనులను దప్పించుకొనిపోవుచుండగా రక్షకపురషులు దానింజూచి అనుమానము జెందుచు అగ్నిభయమువలన మార్గమున నిడిన గృహస్థుల సామాగ్రిలోని గంపనెత్తుకొని పోవుచున్నదని నిశ్చయించి నీవెవ్వతవు? ఈగంపలోనిది యేమి? యెచ్చటికిగొని పోవుచుంటివని అడిగిరి. అప్పుడది దద్దరిల్లుచు నొకమాటకు వేఱొకమాట జెప్ప దొడంగినది. దానంజేసి, దానిని దొంగగా నిశ్చయించి యాగంప లాగికొని యా వీధిలో నొకచోట బెట్టించిరి. అదియు దండనభయమువలన నిజముజెప్పక యాసంవాదములో నెట్లో పాఱిపోయినది. ఆరాజభటులు నాగంపనంతగా విమర్శింపక అగ్నిజ్వాలలచే నావృతములగుచున్న భవనములను గాపాడుటకై తొందరగా బోయిరి.

ఆచిత్రమంతయు రంధ్రములనుండి నేనుజూచుచునేయుంటిని. అప్పుడు నేను గర్తవ్య మరయలేక నిభ్రాంతనై యాచేఁటిక మరలవచ్చి తీసికొని పోవునేమోయను నాసతో నుంటిగాని దానిఁజాడ యెప్పటికిని గనంబడినదికాదు. ఇంతలోఁ గొందఱు