పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలతి కథ

291

ఇందు వైపరీత్య మైదటుల కనంబడుచున్నది. గంపలోనుండుటజూడ వివాహకృత్య మసత్యమైనటుల గనంబడుచున్నది. మాచేతులార కన్యాదానంబు గావించి యది యసత్యమని మేమెట్లు తలంతుము, ఈమాయను దెలిసికొన దుర్ఘటముగా నున్న యది. ఇంతయు నామువ్వురివలనం గలిగినది. వారినెంత దండించినను నిజముచెప్పకున్నవారలు. ఇంక వారి నురిదీయుటకాజ్ఞయిచ్చుచున్న వాడను. పిమ్మట విచారించుకొనెదముగాక యని పలికిన నక్కలికి యిట్లనియె.

తండ్రీ! వాండ్రు తస్కరులని తో చదు. అంతర్ముఖులవలె గనంబడుచున్నవారట. మనదూతలు వచ్చులోపల తరుకోటరమునుండి నేను మొఱ్లిన నన్ను బుడమికి దింపిరి. ఇంతకన్న మఱేమియుం జేయలేదు. క్రూరులయినచో నూరకుందురాయనుడు నయ్యెడయుండు వీండ్రు నన్ను తీసికొనిపోవుటకు కారణ మున్నది. మొన్నరాత్రి నిన్ను వీరిలో నెవ్వరికో కపటవివాహము గావించితిమి. ఆతగులము మనంబునం గలిగి వీరు నినుదీసికొనిపోయిరని తలంచెదనని పలికిన యచ్చిలుకలకొల్కి యులికిపడుచు నృపతి కిట్లనియె.

ఏమీ! నాకుఁ గపటవివాహము గావించితిరా? కపటవివాహమననేమి? పెండ్లి కాకమున్ను గూఢముగా దేవతాసపర్య చేయవలయునని చెప్పి చీకటిలో గుడికి తీసుకొనిపోయి చేసినదియా ? అటులఁ జేయుటకు కారణమేమన యా నరపతి యిట్లనియె.

అమ్మా! నీవుపుట్టిన కొన్ని దినంబులకు త్రికాలవేదియగు దైవజ్ఞుండొకడు వచ్చిన నతనినర్చించి నీజాతకపత్రికంజూపి భావిఫలస్థితి జెప్పుడని నేనడిగితిని. ఆతండది విమర్శించి విదేశీయుండగుటచే తనభాషతో నేదియోవ్రాసి యప్పత్రిక నిచ్చి యడిగెను. ఆభాష తెలిసితెలియని యొక బ్రాహ్మణునిచే చదివింప నీచిన్నదానికి పెండ్లి దినముననే మగడు చచ్చు ననియు రెండవవివాహము జరుగుననియు నందు సార్వభౌముడు పతియగుననియుఁ దెలియవచ్చినది.

ఆమాటనమ్మి భవదీయవైధవ్యము సైరింపక మొన్న నీకు ముందుగా నట్లు కపటవివాహము గావించితిమి. అదియట్లుండె. నిన్నటిదినం బీవిషయము విమర్శించి మరియొక బ్రాహ్మణుం డాపత్రికం జదివి మొదట జదివినవాని కాభాష లెస్సగాఁ దెలియకపోవుటచే నట్లు చెప్పెననియు దైవజ్ఞుడీ ముదితకు మొదటి వివాహభర్తయే చక్రవర్తి యగుననియు రెండవసారి పెండ్లియాడఁ ప్రయత్నించినవాడు పరలోక గతుఁడగుననియు వ్రాసియున్నాడని చెప్పెను.

రెండును బూటకములే యయినవి వెర్రివాడు చక్రవర్తి యెట్లగును? దైవజ్ఞులమాట నమ్మదగినదా! ఇప్పు డేమి చేయుటకుఁ దోచకున్నదని పలుకుటయు నక్కుటిలాలక యిట్లనియె.

అయ్యయ్యో! తండ్రి యైహికసుఖంబుల కాసపడి చెడుకృత్యంబులు చేయ దొడంగవచ్చునా? ప్రజల ధర్మాధర్మంబులరసి పాలించెడు రాజే యధమకార్యంబులం