పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుని కథ

239

నలకూబరుండు రూపంబున మనోహరుండయినను సతతము రంభాసక్తుండు గావున నతనికిచ్చితిమేని మనపుత్రిక సాపత్నీపరిభవభేదం బనుభవింపవలసివచ్చును. రాచబిడ్డండు కోరిన నీయకపోరా దేమిచేయుదమని యభీష్టదేవతయిన హటకేశ్వరుని ధ్యానించి రాత్రి నిద్రవోయిన నాభక్తవత్సలుండు స్వప్నంబున బొడసూపి యర్ధయామములో బుడమిగల దివ్యక్షేత్రంబుల దిరిగివచ్చిన వానికిగాక నితరునికి నీ పుత్రిక నీయవలదని చెప్పి యంతర్హితుడయ్యెనట. ఆమాటయే మజ్జనకుండయిన మాణిభద్రుడు నలకూబరునికి తెలియజేయ నప్పని సేయనేరక యతడు నాయందు విముఖుండయ్యెను. దానంజేసి యనేక యక్షకుమారులు వచ్చి నన్నడిగినను మాణిభద్రుడు తన శపథప్రకార మెఱింగించిన నెవ్వరు నప్పని కొడంబడరయిరని తనకథయంతయు జెప్పినది.

తమాలిక - ఓహో యిదియా కారణము అగుంగాక ప్రభావసంపన్నుడుగాక యట్టిపని సేయనేరడు అట్టివాడు సుందరవంతుడగునో కాడోయని వెరచుచున్నదాన రూపప్రభావంబు లొక్కచో నుండుట దుర్గటముగదా?

మల్లిక - "యతాకృతి స్తత్రగుణాభవంతీ"యను నార్యోక్తి వినియుండ లేదా? రూపమున్న చోటనే ప్రభావముండును. అదియునుంగాక భగవద్వచనము రిత్త పోవునదియే ?

తమాలిక - ఆమాట నిజమగును అదిగో చారుమతి కదళీవనంబునుండి వచ్చుచున్నది. పూజాభావంబుల సవరింపుమా.

చారుమతి - (ప్రవేశించి) సఖులారా? నన్ను జూచి నవ్వుచున్నా రేమి?

మల్లిక - నలకూబరునిం బరిహసించు మనోహరుం బడయుదువని సంతసించుచున్నవారముకాని నవ్వుకాదు.

చారుమతి — నాకు రాత్రివచ్చిన స్వప్నమే యథార్థమైనచో నలకూబరుని వెక్కిరింపవచ్చును.

మల్లి -- అదియేమి?

చారుమతి — ఒకమనుష్యుని బెండ్లి యాడినట్లు కలగంటి.

తమాలిక - ఇదియేకదా?

చారుమతి - మనుష్యులనిన దక్కువగా బలుకుచుంటివి. దేవకాంతలు మనుష్యుల వరించినట్లు వినియుండలేదా. త్రిలోకసుందరియగు నూర్వశి పురూరవుని వరించినది. మఱచితివి కాబోలు. దేవతలను మన యక్షులకు మించిన సోయగము గల రాచకుమారులు మనుష్యులలో వేనవేలున్నారు.

మల్లిక - బోటీ! నీమాటవలన జ్ఞాపకమువచ్చినది. మొన్నను శివరాత్రికి నేను శ్రీశైలము పోయినప్పు డొకచోట బురాణము వినుచున్న యొక చిన్నవానిం బొడగంటి. ఆహా! అటువంటి సొగసుకాని నేనెందును గనివినియెరుంగ. గుణశీలనామంబులు దెలిసికొనవలయునని పెద్దతడవా ప్రాంతమందు నివసించితిని. కాని పదు