పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

213

నీయన మందారవల్లి నోడించెనని చెప్పితిరి. ఏవిద్యలో నోడించెను. లవిత్ర యోడించినదని యొక వాడుకగా నున్నది.ఆమె యెవ్వతె? ఈ కథవిన నౌత్సుక్యముగానున్నది. ఎఱిగింపవలదే యనుటయు విజయవర్మ రామలింగకవి మొగము చూచెను.

అప్పుడు రామలింగకవి యోహో! ఈ సుందరి మందారవల్లివలె నున్నదే? మంత్రిని దండ్రియని పిలుచుచున్నది. ఈ బాంధవ్య మెట్లు కలిసినది . ద్విజులకు వేశ్యలకు సంబంధము లుండునా? సర్వము విమర్శింప దప్పక మందారవల్లియని స్థిరపడుచున్నది. ఇది మిక్కిలి వింతగా నున్నదని తలంచుచు నేదియు నిశ్చయింపలేక యట్లే ధ్యానించుచు మంత్రిమాట కుత్తరము చెప్పడయ్యెను.

అప్పుడు సుభద్రుడు ఆర్యా! మందారవల్లిని జయించుటకు విద్యలదాక పోవ నక్కరలేదు. ఈతండు మాటలలోనే యాబోటిని నిరుత్తరం జేసెను. లవిత్రయన నీయనిశక్తియని తెలిసికొండని తత్సమయోచితముగా నుత్తరమిచ్చెను.

రామలింగకవి యామాట లేమియు మనమున బట్టింపక వారచూపులచే నా యువతింజూచి మోహవివశుండై మందారవల్లి యే యని నిశ్చయించి వితర్కింపుచు భోజనము సేయుట సయితము మఱచి యాలోచింపుచుండెను.

మందారవల్లి తదీయహృదయాభిలాష దెలిసికొని భోజనానంతరము నవరత్నాస్తరణంబునం గూర్చుండి యందరు తాంబూలములు వైచుకొనుచు నిష్టాలాపము లాడుకొనుచున్న సమయమున బదిరెండేడుల ప్రాయముగల యొకచిన్నదాని కొక పద్యము చెప్పి సంగీతము పాడించు నెపంబున వారియొద్ద జదివి రమ్మని యంపిన నబ్బాలికపోయి యాపద్యం బిట్లు చదివినది.

సీ. దాదిహస్తమున దద్దయు ముద్దుగను బెంప
            బడు రాజసుత పెనుజలధిబడుట!
    పడి మునుంగకయుండు ప్రాపున దఱిఁజేరి
            యట వారకామిని కమ్మఁబడుట!
    గణికయై కులవృత్తిఁ గొనక విద్యలనేర్చి
            దేశదేశంబులఁ దిరిగి తిరిగి!
    సిరిఁగోలుపోయి భూసురున కిల్లాలుగా
            మెలఁగి దానములందఁ గలిసికొనుట!
గీ. కొసకు దలిదండ్రులను గూడికొనుట యహహ!
    తలఁచిచూడంగ దైవతంత్రంబుగాదె.

అని వీణమీదబాడి యాబాలిక పైచరణములు రెండును చదువమఱచినది. ఆ పద్యమువిని రామలింగకవి తన హృదయంబునఁ గలికిన సందియమువాయ విస్మయము నొందుచు దచ్చారిత్రమంతయు దానివలన గ్రహించి "చిత్రమిది చిత్రమిది. సుచిత్రమిదియ" అని చదువగా వెంటనే సుభద్రుడు ఆపాదమే “చిత్రమిది చిత్రమిది