పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

207

సంగీతము సాహిత్యము లోనగు విద్యలన్నియుం జెప్పుటకుదగిన గురువుల నియమించినది. ఆ చిన్నదానిబుద్ది మిక్కిలి సూక్ష్మమయినదనియు గురువులకే తప్పులు దిద్దుననియు నెల్లరుం జెప్పుకొనువారు. ఇందుగల విద్వాంసులు చదువు చెప్పుటకు చాలకున్నంత నా కాంతామణిని కాశీపట్టణమున కంపినది. అందా యిందువదన పెక్కువిద్యల సంపాదించి చక్రవర్తులకు సైతము దర్శనమీయక యొప్పుచున్నదని వాడుక యున్నది. ఆ మనోరంజనియు నాలుగేండ్లక్రింద కాలధర్మము నొందినది. ఆ కనంబడునదే దానిమేడ ఇప్పుడు పాడుపడినదని యాకథయంతయు జెప్పినది.

అప్పుడు నేను తద్దయుం జెలంగుచు నందువెడలి మఱి రెండు దినంబులకు గాశీపట్టణంబు ప్రవేశించి యందు మందారవల్లి వృత్తాంతంబు విమర్శింప నది బదియారేడులు వచ్చుదనుక గాశీలో విద్యాభ్యాసముజేసి సకలవిద్యలందును నసమానపాండిత్యము సంపాదించి పెక్కండ్రు శిష్యురాండ్ర వెంటబెట్టుకొని దేశాటనము చేయుచున్నదని తెలియవచ్చినది.

తరువాత నేను విష్ణుశర్మను గుఱించి వితర్కించుచు నతడెఱింగించిన గురుతుల నడిగి తెలిసికొని యతని యింటికిం బోయితిని. అందొక బ్రాహ్మణుండు గనంబడిన నమస్కరింపుచు నయ్యా! విష్ణుశర్మయను బ్రాహ్మణుని యిల్లి దియేనా? ఆయన యింటిలోనుండిరాయని యడిగిన నవ్వుచు నిటనియె.

బోటీ! ఇది యాయనయిల్లేయగుంగాని యాయన స్వర్గస్తుడై పదియేండ్లుదాటినది. అతనికి భార్యాపుత్రులులేరు. మేము దాయాదుల మగుటచే నీయిల్లు మాస్వాధీనమైనదని చెప్పెను. అప్పుడు నేను చింతించుచు నయ్యో! పాపమాయన భార్యయుం బోయినదా? కటకటా? ఎంత కష్టము? కొన్ని యేండ్ల క్రిందట నా దంపతులు హేలాపురినుండి యొక బాలికం చేసికొని వచ్చిరి. ఆ చిన్నది యేమైనదోయని యడుగగా నతండిట్లనియె.

ఓహో! నీవెవ్వతెవు? వారి యాంతరంగిక వృత్తాంత మడుగుచుంటివి హేలాపురినుండి వచ్చినది తన భార్యయని విష్ణుశర్మ నీతో జెప్పెను గాబోలును? కాదు. అదియొక వారకాంత దానిపేరు మంజుభాషిణి, విష్ణుశర్మ కెప్పుడును భార్య లేదు. చిన్నతనములోనే భార్యపోయినది? తిరుగ వివాహము చేసికొనలేదు. ఆ మంజుభాషిణినే భార్యగా జూచుకొని తన సొత్తంతయు దదాయత్తము గావించెను. ఎఱుగని వారా మంజుభాషిణినే భార్యయని తలచుసట్లు సంచరించువాడు.

అతండు పోయినవెనుక మంజుభాషిణి యతని దినవారకృత్యములకై యీ యిల్లు మాకిచ్చినది. దానంజేసి మేమిందుంటిమి హేలాపురినుండి దీసికొనివచ్చిన చిన్నది చక్కగానున్నది దానికి మంజుభాషిణి ప్రియంవదయని పేరుబెట్టి విద్యాబుద్దులం గఱపి పెద్దజేసినది. మహావిద్వాంసురాలని ప్రసిద్ధిబొందిన మందారవల్లికి ప్రఖ్యాతశిష్యురాలయి దానితో నిప్పుడు దేశాటనము చేయుచుండెనని వింటిని దానిం