పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

165

మందా --- పెక్కుదేశములం దిరిగితిని. పెక్కండ్రు సంస్థానపండితులతో వాదించితిని కాని నన్నెవ్వరు నీప్రశ్నము చేయలేదు. ఏనెవ్వరికి గనంబడనని, నియమము చేసికొంటిని దీనం దప్పేమి. వ్రతమునకు శాస్త్రప్రయోజనమేల?

లవిత్ర - మా సంస్థాన పండితులకుసైత మొక వ్రతము గలిగియున్నది. నీవెఱుంగవు కాబోలును. ఎవ్వరేని విద్యావతులగు వారయువతులు వాదింపవచ్చిన వారిం దీసికొనిపోయి తమయింటిలో నుంచుకొనుట నేమము చేసికొనిరి. ముందు మావ్రతము సఫలము చేయుము.

మందా - ఓహో! అనుచితవచనంబులం బల్కుచుంటిరే. చాలుచాలు మీ ప్రజ్ఞాప్రభావంబులు తెల్ల మయినవి.

లవిత్ర - ఇదియేమి తెల్లము! ముందు కాబోవునది చూచుకొనుము.

మందా - స్థానబలంబునంగదా యిట్లు పల్కుట! ఈశ్లేషవచనంబులు మాకునువచ్చును కాని స్వభావముచేతనే స్త్రీలమగుటచేత నీసభలో నాడవెరతుము.

లవిత్ర -- ఆడకున్నను తెరవచ్చినది ఇదియే విపరీతము ఆడువారికిగదా యవనిక.

మందా - ఈ పొల్లుమాటల కేమి ? మీరు చదివిన శాస్త్రము లేవియో పేర్కొనుడు.

లవిత్ర - నేను నీవు చదివినవాటికన్న నూఱుశాస్త్రము లెక్కువ జదివితిని నీయిష్టమువచ్చినదానిలో వాదింపవచ్చును. తెరచాటువాదములకు మేముత్తరము చెప్పము.

మందా - అందులకు నేనొప్పనని మొదటనే చెప్పితినికాదా పెక్కుసారులా మాట ప్రస్తావింపనేల?

లవిత్ర - దానికిసయితము ప్రత్యుత్తర మిచ్చియుంటిమి చాలవేని యోడిపోయితినని పలుకుము.

అని యీరీతిని నిర్భయముగా బలికిన విని యక్కలికి యులికి యతండెట్లో తనగుట్టు గ్రహించెనని తలంచి యప్పు డావిషయమును విమర్శించుటకు న్యాయవాదుల గోరికొనినది.

వారును దమలో గొంతసేపు చర్చించి యాయించుబోడితోఁ గనకగాత్రీ, లవిత్ర నీకన్న నెక్కుడుగా జదువుకొనినదానవని చెప్పుచున్నది. వాదించుటకు సిద్దముగా నున్నదట. బధిరదోషంబునజేసి తెరలోనుండి ప్రసంగింపలేనని చెప్పుచున్నది. స్త్రీలకు స్త్రీలయెడ రాణివాసములేదు. ఇతరస్త్రీలను నీవు చూచుచుంటివిగదా కావున ముఖాముఖీవాదముచేయుట యుచితమని మాకు దోచినది.

శ్లో॥ దిజ్నౌ గానాంపదిపరిహరన్ స్థూలహస్తాపలేపాన్ ॥ అని యున్న కాళిదాస ప్రయోగమునుబట్టి చూడ శాస్త్రవాదములు ముఖాముఖిగా జేయవలయునని స్పష్టమగుచున్నది. ఇప్పుడేని అట్లువాదించి గెలువుము. లేనిచో నీయంద యోటమి