పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(14)

విద్యావతి కథ

113

తమును మరచి యన్య మెఱుగక యక్కలికిమిన్న వలపులం జిక్కి వర్తింపుచుండ బెక్కు వత్సరములు గతించినవి.

ఒక్కనాడు రత్నావతి తన కూతుంజూచి మందలింపుచు పట్టీ! నీవు వట్టినియమంబులం బెట్టుకుని జవ్వనం బంతయు మంచుము పాలుసేయుచున్నదానవు నాగడించిన విత్తమును గొరంత అగుచున్నది.

ఉ. ఒక్కనిబిల్వబంచి మఱియొక్కని చేత బసిండివట్టివే
    ఱొక్కనియింటి కేగుచు మఱొక్కని నానడుచక్కి నొక్కచో
    బుక్కిలి దార్పి కూడ భ్రమబొంది విటుల్ దెలియంగ లేరు గా
    కెక్కడి సత్యమేడ వలపెక్కడి నేమము వారకాంతకున్.

ఇంక నీనియమము లన్నియుంగట్టిపెట్టి ధనార్జనాయత్తచిత్తనై వర్తింపుమని భాధించిన నాలించి యాచంచలాక్షి తల్లితో అమ్మా! నా వృంత్తాత మ్మెఱుంగక నీవట్లనుచున్నదానవు కారణాంతరమునుజేసి నీకును గోప్యము జేసితి నింక దాచనేల సకలలోకాధ్యక్షుడైన పుండరీకాక్షుండు బ్రత్యక్షంబుగా నన్నిరాత్రుల నాతో గ్రీడింపుచున్నవాడు. అమ్మహానుభావుండు నాకు విదుకాడై యుం నీ నీచవిటులతో బ్రయోజన మేమి అని అత్తెఱం గంతయు నెరుంగ చెప్పెను.

ఆ మాటలు విని రత్నావతి యాశ్చర్య మందుచు పుత్రీ! యీరహస్య మిన్నిదినంబులు నాకుఁ జెప్పకుంటివి. నేనోర్వననుకొంటివా యేమి? నీయధ్రయము నాయదికాదా? నాకు మాత్ర మొకసారి దర్శన మిప్పింపగూడదా? అని పలికిన విని విద్యావతి అమ్మహానుభావుని సెలవు లేదు. నేడే ..సాహసినని చెప్పతిని. క్రమంబున జనువు చిక్కుచున్నది. ఆయనకుం జెప్పి నీకు దర్శనమిప్పించెదనని సమాధానము చెప్పి తల్లికి సంతోషము గలుగ జేసినదీ. మఱి యొకనాటిరాత్రి గ్రీడావసానమున సరససల్లాపగోష్ఠి ప్రసంగంబుల విద్యావతి మెల్లన నతనితో నిట్లనియె. దేవా! నా యౌత్సుక్యంబొక్కటి మీకు విన్నపము సేయదలచుకొంటి నది తప్పైనను మన్నింప వేడెద. నేను సకలబ్రహ్మాండనాయకుండవైన నీయండజేరియు నిందుండనేల మీదివ్యధామంబు వైకుంఠంబు జూడ వేడక అగుచున్నది. పురాణంబుల దద్వైభవం బద్భుతముగా వర్ణింపబడియున్నది. కావున నొక్కసారి అచ్చటికి దీసికొని పోయి నన్ను గృతార్థురాలిం గావింపుడని ప్రార్ధించిన నతం డెలనవ్వొలయ లలనామణీ! నీ అభీష్టంబెట్ల అట్లు కావించెద గాని వైకుంఠము జూసినవారికి వెండియుం బుడమికి వచ్చుట అభావ్యంబు. నీకిందు భోగసంతృప్తి అయ్యెనేని వక్కాణింపుము పిదప మన్నివాసంబునకు దీసికొనిపోయెద. ఇదెంతపని అని నొడివిన అవ్వనితయు పంతసించుచు వెండియు అతని కిట్లనియె.

స్వామీ! యుత్కృష్టసుఖంబు లభించుచుండ నల్పసుఖంబుల కాసించువారుందురా? మీ అనుగ్రహంబున వైహికసుభేచ్ఛ నా కేమియు లేదు. కాని అనన్యశరణ్య