పుట:Jeevasastra Samgrahamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరామకాలముల నీగ్రంథరచనకై వినియోగించి దీని నీంతవరకు ముగించితిని.

ఇట్టి గ్రంథమును రచియించుటలో ముఖ్యమైన కష్టము శాస్త్రీయ పదములకు దేశభాషలందు సరియైన పర్యాయపదములు లభింపకుండుటయే. ఈ విషయమున నాశక్తికొలది శ్రమపడి గ్రంథపరిశీలన చేసియును, పండితులతో నాలోచించియును కొంతవరకు సమర్ధించితినని నమ్ముచున్నాను. రసాయన శాస్త్రసంబంధమైన పదముల విషయములో నాగరీప్రచారిణి సభవారిచే నంగీకరింపబడిన వానిని వలయు మార్పులతో వాడితిని.

ఇట్టి శాస్త్రగ్రంథములు పటములు లేకుండ సులభముగా బోధపడవు గనుక నిందు 76 పటములను మిక్కిలి శ్రద్ధతో తయారు చేయించి ఆయాస్థలములయందు వానినిమిడ్చితిని. సాధ్యమైనంతవరకు మన దేశమునందు లభించు జంతువృక్షవర్గములనే గైకొని వానికి పటములను వ్రాయించి యట్టివానిని గూర్చియే ముఖ్యముగా వర్ణించియున్నాను. జంతువులకును వృకములకును గల తారతమ్యములను గ్రహించుటకు క్రిందితరగతి జంతువుల నిర్మాణము తెలిసికొనుట యత్యావశ్యకమై యున్నందున నట్టిజంతువులనుగూర్చి యిందు వర్ణించి యున్నాను. హెచ్చుతరగతిజంతువులగూర్చి ప్రత్యేక గ్రంథమొకటి రచియింప నుద్దేశించినవాడ నగుటచే వానివిషయమై యిందు వివరింపనై తిని. ఈగ్రంథము శాస్త్రపాఠకులగు విద్యార్థులకే గాక, జనసామాన్యమునకుగూడ నుపయోగ పడునిమిత్తమై యుద్దేశింపబడి యున్నందున నట్టివా