పుట:Jeevasastra Samgrahamu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దును. తక్కినరెండును పెరుగవు. అనగా వానినుండి గింజపుట్టదు. కొబ్బరికాయ యొక్క ముచ్చికక్రింద మూడుమొటిమ లుండును. ఈమూడును మూడు అరలయొక్క గుర్తులను చూపట్టును. అందు ఒకమొటిమ పెద్దది. ఇదియే కాయ అయినది. కొబ్బరికాయ గుంజులో నిట్లు పెరిగిన అరకు ఎదురుగా చిన్న మొలక యుండును. కొన్నిజాతుల కొబ్బరికాయలలో రెండుమూడు అరలుండునట. ఇందొక్కొక కాయలోపల రెండుమూడుకాయ లుండవచ్చును. ఇవి అండాశయమునందలి అరలన్నియు వృద్ధిజెందుటచే నేర్పడిన రూపములు.

నిజమైనకాయలు.

కొన్ని పుష్పములయందు అండాశయము ఒక్క టేఉండును. అట్టిపుష్పములనుండి ఒక్కటియే కాయపుట్టును. ఇట్టివానికి సామాన్యఫలములనిపేరు. మరికొన్ని పుష్పములలో నొక్కొకపూవునందు అనేక అండాశయములుండి ఒక్కొక అండాశయమునుండి యొక్కొకకాయపుట్టి ఆ కాయలన్నియు వేరువేరుగనుండియును ఒక్కగుత్తిలో వ్రేలాడుచుండును. వీనికి సోదరఫలము లనిపేరు. మరికొన్ని పుష్పములలో అనేక అండాశయములుండి అవి యన్నియు అంటుకొనిపోయి ఒక్కటేకాయగా నేర్పడును. ఇట్టికాయలకు మిశ్రమఫలములనిపేరు. కాని సామాన్యఫలములు, సోదరఫలములు, మిశ్రమఫలములు అనునీ మూడువిధములైన ఫలములునుగూడ నిజమైనకాయలే. అనగా నివియన్నియు అండాశయములనుండి పుట్టినవే.