పుట:Jeevasastra Samgrahamu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తిగలది; పటములో పా. జీ. దీని జీవస్థానము. స్త్రీపత్రముమీద పడకమునుపుగాని లేక పడినతోడనేగాని యుత్పాదకకణము రెండు ఉత్పాదకకణము లగును. ఈకణములకు కణకవచములుండవు. ఇటుపై గలిగెడు మార్పులన్నియు సూక్ష్మబీజము స్థూలబీజాశయముయొక్క కొనదిమ్మమీద ప్రవేశించినతరువాతనే గలుగును.

సూక్ష్మ స్థూలబీజములసంయోగవిథానము.

కొనదిమ్మపై స్రవించు పదార్థముల శక్తియేమో కాని, సూక్ష్మబీజము దానిపై బడగానే అది మిక్కిలి చురుకుగా పెరుగ నారంభించును. దానియందలి పాలకకణ మేదో యొక చోట తన కవచమును పగుల్చుకొని కొనదిమ్మలోని కొక గొట్టముగా పెరుగును. ఈగొట్టమునకు పుప్పొడిగొట్టము (Pollen tube) అని పేరు. ఈపుప్పొడిగొట్టము త్వరలోనే కొనకాడగుండ చొరచుకొని అండాశయముయొక్క పొట్టలోనికి ప్రాకును. పిమ్మట నిది సూక్ష్మరంధ్రమార్గమున స్థూలబీజాశయములోనికిజేరును. తరువాత నీగొట్టము స్థూలబీజాశయగర్భము గుండ ప్రాకి పిండతిత్తిలోని స్థూలబీజముయొక్క సాన్నిధ్యమునకు జేరియుండును. ఇప్పటికి సూక్ష్మబీజములోని యుత్పాదకకణములు రెండును పుప్పొడిగొట్టముయొక్క చివరభాగమునకు దిగియుండును. అందొక యుత్పాదక కణము స్థూలబీజముతో సంయోగమునొంది దానితో నైక్యమగును. ఈ ఉత్పాదకకణముయొక్కయు స్థూలబీజముయొక్కయు జీవస్థానములు మిశ్రమై యేకజీవస్థానమేర్పడుటయే పిండోత్పత్తి. హెచ్చు