పుట:Jeevasastra Samgrahamu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడుము. ఈ రెండుజాతులపూవులును ఒక చెట్టునందే యుండును.

69-వ పటము

పూవులుపై సగభాగముననుండు ఆడపూవులు. క్రింది సగభాగమున నుండునవి మగపూవులు. వీనిలో కొన్ని పగిలియున్నవి, వానియుండి పుప్పొడిరేణువులు అనగా మగబీజములు చెదరిపోవుచున్నవి. కుడిప్రక్కను వికసించిన మగపూవొకటి కొంచెము పెద్దదిగ జూపబడినది. ఆడపూవులు గర్భవతులుకాగానే మగపూవులువీడిపోవును. గర్భవతులైన ఆడపూవులనుండి ఆముదపు కాయలు పుట్టును.