పుట:Jeevasastra Samgrahamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని తిరుగుచుండును. ఇదియు గాక పైని జీవత్వమునకుగలవనివర్ణించిన లక్షణము లన్నియు వృక్షములయెడ గలవు.

వృక్షములకు జంతువులవలె కాళ్లుచేతులు మొదలయిన యింద్రియములు లేకపోయినను, వానియందు జీవనమునకు నావశ్యకమైన అవయవములును, తద్వ్యాపారములును గానవచ్చును. హెచ్చుజాతిజంతువుల శరీరమునకు నాధారముగ అస్థిపంజరము (Skeleton) శరీరములో నున్నటుల వృక్షములను నిలవ బెట్టుటకు కాడయు, కొమ్మలును గలవు. వృక్షము అభివృద్ధియగుటకు బోషకరసము కావలయును. దానిని వృక్షములు వేళ్లద్వారా భూమిలోనుండి గ్రహించును. ఈవేళ్లు వృక్షములకు చేతులు నోరువంటివి. జంతువుల శరీరములోరక్తము ప్రవహించుచున్నటుల వృక్షములలో నొక విధ మైనరసము పారుచుండును. దీనికి మనము వృక్షశోణితమని పేరు పెట్టినను పెట్టవచ్చును. జంతువులకు ఊపిరితిత్తుల (Lungs) వలన జరిగెడుక్రియ ఆకులద్వారాజరుగును. వృక్షశోణితమును వృక్షశరీరమునందంతటను వ్యాపింప జేయ వాహికలుండును. ఇట్టి శరీరనిర్మాణము కలిగి వృక్షములు ఆహారముదిని స్వశరీరము బెంచి వృద్ధియగుచున్నవి. శత్రువులతో బోరాడి బలవంతములయిన వృక్షములు బలహీనములయిన వాని నడచివేయును. స్త్రీపురుష భేదము పుష్పములద్వారా కలిగియుండి వృక్షములు సంతానోత్పత్తి చేయుచున్నవి.

వృక్షములకు జంతువులవలె మెదడుగాని జ్ఞానతంతువులు (Nerves) గాని లేకపోయినను వానికి గొంతవఱకు మనోవికారములు కలవని చెప్పవచ్చును.వృక్షములకు నొకవిధమైన నిద్రయు భయమును కలవు. చింతయాకులు, తురాయియాకులు రాత్రి యొకటిలోనొకటి ముడుచుకొనును. ఇది వాని నిద్ర. ఇటులనే యనేకవృక్షములు రాత్రి నిద్రపోవుచుండుట శాస్త్రజ్ఞులు కనుగొనిరి. కొన్నివృక్షములయాకులను ముట్టినతోడనే యాకులన్నియు ద్వరత్వరగా ముడుచుకొనును. సాధారణముగా 'అత్తిపత్తిచెట్టు' అనబడుచిన్ని చెట్టు ఇటువంటిది. కొన్ని చెట్లయొక్క యొక యాకుమీద సహింపలేని ద్రావకముబోసినయెడల గడమ యాకులన్నియు భయముజెందిన వానివలె వడవడ వడక