పుట:Jeevasastra Samgrahamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెచ్చు తరగతి వృక్షములు.

మొదటి ప్రకరణము.

వృక్షకణము.

వృక్షజాతిజీవులలో కొన్నిటినిగూర్చి యింతవరకు మనము చదివియున్నాము. అందుకొన్ని మనకంటి కగపడక సూక్ష్మదర్శనిచేమాత్రమే చూడదగినవిగా నున్నవి. వీనిలో మొదటివానియందు ఒక్క టేకణముగలదు (31-వ పటములో మాదిరి వృక్షకణము (Typical Vegetable Cell) చూడుము). అది మంచినీళ్లలో నుండు ఆకుపచ్చని నలకలలో నొకటి. అట్టివాని నిర్మాణము బహు సులభమైనది. మన మనుదినము చూచుచుండెడు వృక్షములలో ప్రతివృక్షమును. ఇట్టికణము లనేకములయొక్క కూర్పుచే నేర్పడి యున్నదని ముందు తెలిసికొనగలరు. ఇట్టికణములన్నియు పెద్ద పెద్ద చెట్లయందు ఇదేరూపమున నుండవు.